మరో చరిత్ర సృష్టించిన ఆర్జీవీ
దిశ, సినిమా : ట్రెండ్ సెట్టర్ ఆర్జీవీ మరో ట్రెండ్ సెట్ చేశాడు. ఫస్ట్ మూవీ ‘శివ’తో రికార్డులు బ్రేక్ చేసిన వర్మ టేకాఫ్ స్టైల్‌తో సంచలనాలు సృష్టించాడు. ఆ తర్వాత సెల్‌ఫోన్‌తో మూవీ షూట్ చేసి ఆశ్చర్యానికి గురిచేసిన వర్మ.. ఇప్పుడు మరో ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు. తన లేటెస్ట్ పిక్చర్ ‘డేంజరస్’ను నాన్ ఫంజిబుల్ టోకెన్(NFT) పద్ధతిలో రిలీజ్ చేసి సంచలనం సృష్టించాడు. ఈ క్రమంలో ‘డేంజరస్’ ప్రపంచంలోనే ఎన్ఎఫ్‌టీ రూపంలో రిలీజ్ అయిన […]
దిశ, సినిమా : ట్రెండ్ సెట్టర్ ఆర్జీవీ మరో ట్రెండ్ సెట్ చేశాడు. ఫస్ట్ మూవీ ‘శివ’తో రికార్డులు బ్రేక్ చేసిన వర్మ టేకాఫ్ స్టైల్‌తో సంచలనాలు సృష్టించాడు. ఆ తర్వాత సెల్‌ఫోన్‌తో మూవీ షూట్ చేసి ఆశ్చర్యానికి గురిచేసిన వర్మ.. ఇప్పుడు మరో ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు. తన లేటెస్ట్ పిక్చర్ ‘డేంజరస్’ను నాన్ ఫంజిబుల్ టోకెన్(NFT) పద్ధతిలో రిలీజ్ చేసి సంచలనం సృష్టించాడు.
ఈ క్రమంలో ‘డేంజరస్’ ప్రపంచంలోనే ఎన్ఎఫ్‌టీ రూపంలో రిలీజ్ అయిన తొలి చిత్రంగా చరిత్రలో నిలిచింది. మొత్తం ఆరు లక్షల టోకెన్లుగా నిర్ణయించిన మూవీ యూనిట్.. కేవలం లక్ష టోకెన్లు తమ దగ్గర పెట్టుకుని.. ఐదు లక్షల టోకెన్స్‌ను వేలానికి పెట్టింది. ఎలాగూ వర్మ ఇన్‌ఫ్లుయన్స్ మామూలుగా ఉండదు కాబట్టి ఈ టోకెన్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోగా ఆర్జీవీ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫెంటాస్టిక్ వే చూపించారు.