2021లో విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్స్!

దిశ, ఫీచర్స్: వంటింటి ప్రయోగాలతో తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్నికి పనిచెప్పే ఆహార ప్రియులు.. రెస్టారెంట్స్, రోడ్ సైడ్ స్టాల్స్‌లో కొత్తరకం వంటకాలు కనిపిస్తే వదలకుండా తినేస్తారు. ఒక్కోసారి ఆ కాంబినేషన్స్‌ చూస్తేనే నోరూరే అవకాశం ఉండగా.. 2021లో ఎంతోమంది చెఫ్స్ ఇన్నోవేటివ్ ఎక్స్‌పరిమెంట్స్‌తో రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో వైరల్‌గా మారిన కొన్ని మిక్సింగ్ వంటకాలు వాటి పేర్లతోనే అదో రకమైన ఫీలింగ్ కలిగించాయి. ఇక ఈ ఏడాది లెక్కలేనన్ని విచిత్రమైన ఆహారాలు ఫుడ్ లవర్స్‌ను భయపెట్టాయి. అందులో […]

Update: 2021-12-27 06:47 GMT

దిశ, ఫీచర్స్: వంటింటి ప్రయోగాలతో తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్నికి పనిచెప్పే ఆహార ప్రియులు.. రెస్టారెంట్స్, రోడ్ సైడ్ స్టాల్స్‌లో కొత్తరకం వంటకాలు కనిపిస్తే వదలకుండా తినేస్తారు. ఒక్కోసారి ఆ కాంబినేషన్స్‌ చూస్తేనే నోరూరే అవకాశం ఉండగా.. 2021లో ఎంతోమంది చెఫ్స్ ఇన్నోవేటివ్ ఎక్స్‌పరిమెంట్స్‌తో రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో వైరల్‌గా మారిన కొన్ని మిక్సింగ్ వంటకాలు వాటి పేర్లతోనే అదో రకమైన ఫీలింగ్ కలిగించాయి. ఇక ఈ ఏడాది లెక్కలేనన్ని విచిత్రమైన ఆహారాలు ఫుడ్ లవర్స్‌ను భయపెట్టాయి. అందులో కొన్ని ఐటమ్స్ మీకోసం.

మ్యాగీ క్రియేటివ్ మ్యాడ్‌నెస్:

చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎవరైనా మ్యాగీని ఇష్టంగా తింటారు. కానీ ఎప్పుడూ ఒకే రకంగా తింటే కచ్చితంగా బోర్ కొడుతుంది. అందుకే కొందరు నూడుల్ లవర్స్ ‘మ్యాగీ’ పై చిత్రవిచిత్ర ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలో ఖీర్ మ్యాగీ, బెల్లం మ్యాగీ, మ్యాగీ మిల్క్‌షేక్, ఐస్‌క్రీమ్‌‌తో పాటు ఓరియో వేరియంట్‌తో చేసిన మ్యాగీ లడ్డూలను చూసి ఈటర్స్ ఆశ్చర్యపోయారు. కానీ కార్బొనేటెడ్ డ్రింక్ ‘ఫాంటా’ మాత్రం అందరినీ భయపెట్టింది.

ఓరియో పకోడీ:

అహ్మదాబాద్‌కు చెందిన ఓ బజ్జీ సెంటర్ నిర్వాహకుడు.. శనగపిండి, ఓరియో బిస్కెట్స్ తో పకోడీలు వేసి అందరిని విస్తుపరిచాడు. ఓరియో పకోడి పూర్తయిన తర్వాత పచ్చిమిర్చి, ఖర్జూరంతో అందించాడు. దీనికి సంబంధించిన వీడియో ‘ఫుడ్ ఇన్‌కారినేట్’ యూట్యూబ్ చానల్‌లో ప్రసారమవడంతో వైరల్‌గా మారింది.

అగ్రస్థానంలో.. పాన్‌తో బ్రౌనీ

విలాసవంతమైన దేశీ విందు తర్వాత మీటా పాన్ తినడం సంప్రదాయంగా వస్తోంది. అంతేకాదు భోజనమయ్యాక ఐస్‌క్రీమ్ తినడం కూడా ఇటీవలి కాలంలో అలవాటుగా మారింది. అయితే అహ్మదాబాద్‌లోని ఓ ఫాస్ట్‌ఫుడ్ యజమాని ‘పాన్, బ్రౌనీ’ రెండింటిని మిక్స్ చేసి అందించాడు.

రసగుల్ల చాట్:

బెంగాలీలకు ఇష్టమైన స్వీట్ రసగుల్లా. ఈ ఏడాది అత్యంత ఆశ్చర్యకరమైన ఆహార ప్రయోగాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఏదైనా వినూత్నంగా తయారు చేయాలనే ప్రయత్నంలో.. ఢిల్లీకి చెందిన ఓ విక్రేత రసగుల్లాను ప్రధాన పదార్థంగా పెరుగు, డ్రై ఫ్రూట్స్, చింతపండు చట్నీతో చాట్ తయారుచేశాడు. దీంతో ఢిల్లీ వాసులతో పాటు నెటిజన్ల నుంచి మిశ్రమ కామెంట్స్ అందుకున్నాడు.

మిర్చి ఐస్ క్రీమ్ రోల్:

ఇండోర్‌లోని ఒక ఫుడ్ స్టాల్ విక్రేత.. కోసిన పచ్చి మిరపకాయలకు నుటెల్లా, మిల్క్ క్రీమ్ జోడించాడు. ఆ తర్వాత బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని రోల్స్‌గా చేసి ఫ్రీజర్‌లో పెట్టాడు. అయితే, మెజారిటీ ఇంటర్నెట్ వినియోగదారులు మాత్రం ఈ ‘ఐస్ క్రీమ్ ప్రయోగాన్ని’ అసహ్యంగా భావించారు.

చాక్లెట్ మసాలా స్వీట్ కార్న్:

తూర్పు ఢిల్లీలోని ఓ విక్రేత చాక్లెట్ సాస్‌తో ఉడికించిన మొక్కజొన్నను కస్టమర్స్‌కు సర్వ్ చేశాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ మిశ్రమానికి జున్ను, మసాలా కూడా యాడ్ చేయడంతో చీజీ చాక్లెట్-మొక్కజొన్న విమర్శల పాలైంది.

క్రిసెంట్ వడ పావ్:

ముంబైలో ఫేమస్ స్ట్రీట్‌ఫుడ్‌ ఏదంటే ‘వడపావ్’ పేరే వినిపిస్తుంది. అయితే, దీనికి మోడ్రన్ టచ్ ఇచ్చేందుకు ప్రయత్నించిన ఒక రెస్టారెంట్ నిర్వాహకుడు.. పావ్‌ను క్రోసెంట్‌తో భర్తీ చేసి ఫ్రెంచ్ శైలిలో కొత్తగా ఆవిష్కరించాడు.

ఈ క్రమంలోనే ‘మ్యాంగో ఐస్‌క్రీమ్ చాట్, బటర్ చికెన్ గోల్‌గప్పా, ఓల్డ్ మాంక్‌తో గులాబ్ జామూన్‌’ వంటి ఎన్నో ప్రయోగాలు చేపట్టారు. ఇందులో చాలా వరకు ఆహార ప్రియులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే కస్టమర్ల అటెన్షన్, బిజినెస్ స్ట్రాటజీ కోసం ఇలాంటి ప్రయోగాలు చేయడం సర్వసాధారణం కానీ ఆ ఫుడ్ వల్ల కస్టమర్స్‌కు ఎలాంటి నష్టం రాకుండా చూసుకోవాలి. కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ విష పదార్థాలుగా మారే అవకాశం ఉంది. ప్రయోగాలకు ఓ హద్దు ఉంటుందని ఫుడ్ మేకర్స్ గుర్తుంచుకోవాలి.

Tags:    

Similar News