టాలెంట్ ఉన్నప్పుడు బలుపు ఉన్నా తప్పులేదు.. అల్లు అర్జున్‌పై నటి షాకింగ్ పోస్ట్

‘పుష్ప-2’(Pushpa 2: The Rule) విడుదలకు ముందుకు సంధ్య థియేటర్‌(Sandhya Theater)లో ప్రీమియర్స్ వేయగా ఇందులో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.

Update: 2024-12-25 09:02 GMT

దిశ, సినిమా: ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) విడుదలకు ముందుకు సంధ్య థియేటర్‌(Sandhya Theater)లో ప్రీమియర్స్ వేయగా ఇందులో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో ఇటీవల అల్లు అర్జున్‌‌(Allu Arjun)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బెయిల్‌పై ఆయన బయటకు వచ్చారు. ఈ క్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ ఇష్యూపై అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడటంతో వివాదం మరింత ముదిరింది.

దీంతో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ సంధ్య థియేటర్ ఘటన ఓ కొలుక్కి రాలేదు. మళ్లీ అల్లు అర్జున్ పోలీసుల విచారణకు వెళ్లి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీకి సంబంధించిన వారెవ్వరూ ఐకాన్ స్టార్‌కు సపోర్ట్‌ చేయలేదు. తాజాగా, హీరోయిన్ శ్రీ సుధ అల్లు అర్జున్‌కు అండగా నిలిచింది. ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసింది.

గురుకులాల్లో విద్యార్థులు చనిపోయిన పేపర్ కటింగ్‌(Paper cutting)ను షేర్ చేసింది. ఈ పిల్లల ప్రాణాల గురించి పట్టించుకోరు కానీ అల్లు అర్జున్(Allu Arjun) గురించి మాట్లాడతారా అనే విధంగా ఆమె పోస్ట్ ఉంది. అలాగే ‘‘అల్లు అర్జున్‌‌లో టాలెంట్ ఉన్నప్పుడు బలుపు ఉన్నా తప్పులేదు’’ అని క్యాప్షన్ పెట్టి తగ్గేదెలా అని ఐకాన్ స్టార్ మ్యానరిజం‌ను షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు.

 

Tags:    

Similar News