విగ్రహానికి అడ్డుగా ఉన్నాయనీ ఏకంగా షాపులను తొలగించిన అభిమానులు..

దిశ, చౌటుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో నెలకొల్పిన ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి అడ్డుగా ఉన్న షాపులను ఆయన అభిమానులు శనివారం తొలగించారు. ఆర్టీసీ అధికారులు షెడ్‌లు నిర్మించి దుకాణదారులకు కిరాయిలకు ఇవ్వడంతో మాధవ రెడ్డి విగ్రహం కనబడడం లేదని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మాధవ రెడ్డి అభిమానులు విగ్రహం ఎదురుగా ఉన్న షాప్ లను తొలగించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న మాధవరెడ్డి […]

Update: 2021-12-11 11:24 GMT

దిశ, చౌటుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో నెలకొల్పిన ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి అడ్డుగా ఉన్న షాపులను ఆయన అభిమానులు శనివారం తొలగించారు. ఆర్టీసీ అధికారులు షెడ్‌లు నిర్మించి దుకాణదారులకు కిరాయిలకు ఇవ్వడంతో మాధవ రెడ్డి విగ్రహం కనబడడం లేదని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మాధవ రెడ్డి అభిమానులు విగ్రహం ఎదురుగా ఉన్న షాప్ లను తొలగించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న మాధవరెడ్డి కుమారుడు జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

వెంటనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి విగ్రహానికి అడ్డుగా ఉన్న షాపులను తొలగించాలని సూచించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, కౌన్సిలర్ బాబా షరీఫ్, మాజీ జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, మాధవ రెడ్డి అభిమానులు, తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News