అత్తాపూర్‌లో ఫ్యామిలీ మిస్సింగ్.. ఆ నలుగురు ఏమైనట్టు..?

దిశ, రాజేంద్రనగర్ సర్కిల్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అదృశ్యమైన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్ అబ్రార్ అనే వ్యక్తికి భార్య అమ్రీన్, ఇద్దరు పిల్లలు అక్ష బేగం, అజ బేగం సంతానం. వీరితో పాటు అబ్రార్ అత్త ఖామర్ జహన్ కూడా ఉంటోంది. అయితే ఆదివారం మధ్యాహ్నం అబ్రార్ ఇంట్లో లేని సమయంలో నలుగురు కుటుంబ సభ్యులు కలిసి బయటకు వెళ్లారు. కానీ, ఇంటికి […]

Update: 2021-10-25 09:03 GMT

దిశ, రాజేంద్రనగర్ సర్కిల్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అదృశ్యమైన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్ అబ్రార్ అనే వ్యక్తికి భార్య అమ్రీన్, ఇద్దరు పిల్లలు అక్ష బేగం, అజ బేగం సంతానం. వీరితో పాటు అబ్రార్ అత్త ఖామర్ జహన్ కూడా ఉంటోంది. అయితే ఆదివారం మధ్యాహ్నం అబ్రార్ ఇంట్లో లేని సమయంలో నలుగురు కుటుంబ సభ్యులు కలిసి బయటకు వెళ్లారు. కానీ, ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన సయ్యద్ అబ్రార్ పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారే ఎక్కడికైనా వెళ్ళారా ? లేక ఎవరైనా తీసుకెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News