సీఎం కేసీఆర్‌తో కలిసి కుటుంబ సభ్యులు ఢిల్లీకి పయనం
దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సెప్టెంబరు 2వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. కాగా, ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలివెళ్లారు. రెండ్రోజుల పాటు అక్కడే ఉంటారు. పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్రస్థాయి నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కేంద్ర […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సెప్టెంబరు 2వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. కాగా, ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలివెళ్లారు. రెండ్రోజుల పాటు అక్కడే ఉంటారు. పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్రస్థాయి నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఢిల్లీలోని వసంత్ విహారం మెట్రో స్టేషన్ పక్కన 1300 గజాల స్థలాన్ని కేటాయించింది. శంకుస్థాపన చేసిన ఏడాది కాలంలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. కాగా వారంతా తిరిగి 3వ తేదీ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.
ఉదయమే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి సీఎం భూమిపూజ చేయబోయే స్థలాన్ని పరిశీలించారు.