MR .Bean: 'మిస్టర్​ బీన్'​ చనిపోయాడు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

దిశ, వెబ్‌డెస్క్:  స్లాప్​స్టిక్​ కామెడీ, మైమ్​ యాక్టింగ్​ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు మిస్టర్ బీన్. (Mr. Bean) నవ్వుల రారాజుగా ఎన్నో ఏళ్లు నుంచి తన హావభావాలతో ప్రేక్షకులను నవ్విస్తున్న మిస్టర్ బీన్  అలియాస్ రోవాన్ ఎట్కిన్‌సన్ చనిపోయాడంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. రోవాన్​ చనిపోయాడంటూ మే 29న ఓ వార్త ఫేస్​బుక్​లో.. అది కూడా మిస్టర్​ బీన్​ ఫేస్​బుక్​ పేజీ నుంచే విపరీతంగా షేర్​ అయ్యింది. దీంతో […]

Update: 2021-06-06 00:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్లాప్​స్టిక్​ కామెడీ, మైమ్​ యాక్టింగ్​ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు మిస్టర్ బీన్. (Mr. Bean) నవ్వుల రారాజుగా ఎన్నో ఏళ్లు నుంచి తన హావభావాలతో ప్రేక్షకులను నవ్విస్తున్న మిస్టర్ బీన్ అలియాస్ రోవాన్ ఎట్కిన్‌సన్ చనిపోయాడంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. రోవాన్​ చనిపోయాడంటూ మే 29న ఓ వార్త ఫేస్​బుక్​లో.. అది కూడా మిస్టర్​ బీన్​ ఫేస్​బుక్​ పేజీ నుంచే విపరీతంగా షేర్​ అయ్యింది. దీంతో ఆయన అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతిలో మునిగిపోయి రెస్ట్ ఇన్ పీస్ అంటూ ఆయన ఫోటోలను సోషల్ మీడియా లో వైరల్ చేశారు.

అయితే ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని, అది తప్పుడు వార్త అని తెలియడంతో నెటిజన్స్ బోగస్‌ పేజ్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బోగస్ పేజీ నుంచి ఆ పోస్ట్ ని డిలీట్ చేయాలనీ అభిమానులు డిమాండ్ చేశారు. దీంతో ఆ పోస్ట్ తో పాటు బోగస్ పేజ్ ని కూడా నిర్వాహకులు డిలీట్ చేశారు. ఇకపోతే మిస్టర్ బీన్ చనిపోయాడంటూ వస్తున్నా ఈ వార్తలు ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే ఇలా 6 సార్లు జరగడం గమనార్హం. 66 ఏళ్ల రోవాన్​ చనిపోయాడంటూ 2012, 2013, 2015, 2016, 2017, 2018 సంవత్సరాలలో కూడా తప్పుడు ప్రచారం జరిగింది. ఇక మిస్టర్ బీన్ మీమ్స్ మన తెలుగువారికి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన హావభావాలతోనే ఎన్నో కోట్లమంది అభిమానులను సంపాదించుకున్నారు.

Tags:    

Similar News