ఫేక్ ఐడీతో నకిలీ ఎస్సై ఏం చేశాడో తెలుసా?
దిశ ఏపీ బ్యూరో: కరోనా కట్టడివేళ ఫేక్ ఐడీతో ఎస్సైనంటూ దర్జాగా తిరుగుతున్న నకిలీ ఎస్‌ఐ విజయవాడలో పట్టుబడి కటకటాలు లెక్కబెడుతున్నాడు. విజయవాడ భవానీపురం పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే… తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన గుత్తాల ప్రశాంత్ హైదరాబాద్‌లోని ఒక టీవీ ఛానల్‌లో కరెస్పాండెంట్‌గా పని చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి ముమ్మిడివరం తిరిగే ప్రశాంత్‌కి కరోనా లాక్‌డౌన్ ఆంక్షలు, ప్రధానంగా రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు మరింత ఇబ్బంది పెట్టాయి. దీంతో ఉపాయం ఆలోచించి, సైబరాబాద్ […]
దిశ ఏపీ బ్యూరో: కరోనా కట్టడివేళ ఫేక్ ఐడీతో ఎస్సైనంటూ దర్జాగా తిరుగుతున్న నకిలీ ఎస్‌ఐ విజయవాడలో పట్టుబడి కటకటాలు లెక్కబెడుతున్నాడు. విజయవాడ భవానీపురం పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే… తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన గుత్తాల ప్రశాంత్ హైదరాబాద్‌లోని ఒక టీవీ ఛానల్‌లో కరెస్పాండెంట్‌గా పని చేస్తున్నాడు.
ఎప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి ముమ్మిడివరం తిరిగే ప్రశాంత్‌కి కరోనా లాక్‌డౌన్ ఆంక్షలు, ప్రధానంగా రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు మరింత ఇబ్బంది పెట్టాయి. దీంతో ఉపాయం ఆలోచించి, సైబరాబాద్ సిటీ ఎస్ఐగా ఫేక్ ఐడీ సృష్టించాడు. కారు నంబర్ ప్లేట్ AP 05 DP 5911 అయితే దానిని మార్చేసి TS 08 DP 5911 గా రాసుకుని దర్జాగా తిరిగేయడం ఆరంభించాడు. ఆపిన చోటల్లా ఎస్ఐని అంటూ బిల్డప్ ఇచ్చేవాడు. ఇలా హైదరాబాద్ నుంచి చెక్ పోస్టులు దాటుకొని వచ్చిన ప్రశాంత్.. విజయవాడలోని భవానీపురం పోలీసుల తనిఖీకి దొరికిపోయాడు. ఐడీ కార్డు తేడాగా ఉండటంతో అదుపులోకి తీసుకుని విచారిస్తే… నకిలీ ఎస్సై భాగోతం బయటపడింది.
దీంతో అతని పూర్తి చరిత్రను వెలికి తీస్తున్నారు. ఎస్సై పేరిట చెక్‌పోస్టులకే మస్కా కొట్టాడా? లేక నకిలీ ఐడీ మాటున దందా షురూ చేశాడా? అన్ని వివరాలు సేకరిస్తున్నారు. అతనిపై ఐపీసీ 170, 419, 465 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు.