మిత్రోన్ ఫేక్ యాప్‌ను ఎలా గుర్తించాలి?

దిశ, వెబ్‌డె‌స్క్ : టిక్‌టాక్‌కు పోటీగా.. ‘మిత్రోన్’ యాప్ వచ్చిన విషయం తెలిసిందే. చైనాపై వ్యతిరేకత కారణంగా.. రిలీజైన నెల రోజుల్లోనే ఈ యాప్‌‌ను 50 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకోవడంతో బాగా పాపులారిటీని సంపాదించింది. అయితే గూగుల్ ప్రైవసీ పాలసీ పాటించడం లేదనే కారణంతో ఆ మధ్య ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి తొలిగించారు కూడా. ఆ తర్వాత ఇష్యూస్ అన్ని క్లియర్ కావడంతో ‘గూగుల్ ప్లే స్టోర్‌’లోకి మళ్లీ అందుబాటులోకి వచ్చింది. అయితే […]

Update: 2020-06-19 02:15 GMT

దిశ, వెబ్‌డె‌స్క్ :
టిక్‌టాక్‌కు పోటీగా.. ‘మిత్రోన్’ యాప్ వచ్చిన విషయం తెలిసిందే. చైనాపై వ్యతిరేకత కారణంగా.. రిలీజైన నెల రోజుల్లోనే ఈ యాప్‌‌ను 50 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకోవడంతో బాగా పాపులారిటీని సంపాదించింది. అయితే గూగుల్ ప్రైవసీ పాలసీ పాటించడం లేదనే కారణంతో ఆ మధ్య ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి తొలిగించారు కూడా. ఆ తర్వాత ఇష్యూస్ అన్ని క్లియర్ కావడంతో ‘గూగుల్ ప్లే స్టోర్‌’లోకి మళ్లీ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ యాప్‌ను పోలిన చాలా ఫేక్ యాప్స్.. ప్లే స్టోర్‌లో కనిపిస్తుండగా, ఆ ఫేక్ యాప్స్‌ను గుర్తించేందుకు కొన్ని టిప్స్ చెబుతున్నారు టెక్ నిపుణులు.

ఐఐటీ రూర్కీ విద్యార్థి శివాంక్ అగర్వాల్ రూపొందించిన ఈ యాప్‌ను ‘మిత్రోన్ టీవీ డెవలపర్స్’ డెవలప్ చేశారు. గూగుల్ ప్లే స్టోర్‌లో ‘మిత్రోన్ యాప్’ అని టైప్ చేయగానే చాలా యాప్స్ దర్శనమిస్తాయి. అవన్నీ కూడా ఒరిజినల్ యాప్‌ను పోలినట్లే ఉంటే, మొదటగా యాప్ నేమ్‌తో పాటు డెవలపర్ నేమ్ చూడాలి. ఉదాహరణకు – మిత్రోన్ (mitron) – టిక్‌టాక్ ఆల్టర్నేటివ్ అని ఉంటే.. అది ‘ఫేక్ యాప్’ అని ఫిక్స్ అయిపోండి. డెవలపర్ నేమ్ ‘మిత్రోన్ టీవీ’ అని మాత్రమే ఉండాలి.

రెండో విషయం.. యాప్‌ను ఇప్పటివరకు ఎంతమంది డౌన్‌లోడ్ చేశారో చూడాలి. వేలల్లో ఉంటే.. అది ఫేక్ యాప్. మిత్రోన్ యాప్‌ను ఇప్పటికే లక్షలాది మంది డౌన్‌లోడ్ చేశారు. డిస్క్రిప్షన్‌తో పాటు యాప్ స్క్రీన్ షాట్స్ కూడా కచ్చితంగా చదవాలి. టెక్ట్స్ ఫార్మాట్ చెక్ చేయాలి. యాప్ ఉపయోగించిన పిక్చర్స్ ఆ యాప్ ఫీచర్స్‌ను డిస్క్రైబ్ చేస్తుంది. ఇవన్నీ గమనించాలి. మోస్ట్ ప్రాబబ్లీ యాప్ పేరు సెర్చ్ చేయగానే.. ఒరిజనల్ యాప్ మొదటగానే కనిపిస్తుంది.

Tags:    

Similar News