ప్రియా నేను ఐపీఎస్ ను.. ఫస్ట్ లుక్ లోనే నచ్చేశావ్.. ఇంతలోనే..

దిశ, జవహర్ నగర్: మ్యాట్రిమోనిలో నీ ప్రొఫైల్ చూశా.. నేను ఐపీఎస్ అధికారిని, ప్రస్తుతం హోమ్ మినిస్ట్రీస్ శాఖలో పని చేస్తున్నా.. తొలిచూపులోనే నచ్చేశావ్‌.. పెళ్లాడితే నిన్నే పెళ్లాడతానని భారీ స్థాయిలో డైలాగులతో అమ్మాయికి దగ్గర అవ్వాలనుకున్నాడు ఓ ప్రబుద్దుడు. అయితే అనుమానం వచ్చిన యువతి పోలీసులను ఆశ్రయించడంతో చివరకు కటకటాలపాలయ్యాడు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ తల్లి తన కూతురు పెళ్లిచూపుల కోసం రెండు నెలల క్రితం తెలుగు మ్యాట్రిమొనీలో కూతురు […]

Update: 2021-11-05 01:06 GMT

దిశ, జవహర్ నగర్: మ్యాట్రిమోనిలో నీ ప్రొఫైల్ చూశా.. నేను ఐపీఎస్ అధికారిని, ప్రస్తుతం హోమ్ మినిస్ట్రీస్ శాఖలో పని చేస్తున్నా.. తొలిచూపులోనే నచ్చేశావ్‌.. పెళ్లాడితే నిన్నే పెళ్లాడతానని భారీ స్థాయిలో డైలాగులతో అమ్మాయికి దగ్గర అవ్వాలనుకున్నాడు ఓ ప్రబుద్దుడు. అయితే అనుమానం వచ్చిన యువతి పోలీసులను ఆశ్రయించడంతో చివరకు కటకటాలపాలయ్యాడు.

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ తల్లి తన కూతురు పెళ్లిచూపుల కోసం రెండు నెలల క్రితం తెలుగు మ్యాట్రిమొనీలో కూతురు వివరాలు పొందుపరిచింది. అయితే ఎనిమిది రోజుల క్రితం వుప్పల హరిప్రసాద్(29) అనే యువకుడు ఫోన్ కాల్స్ చేయడం మొదలు పెట్టాడు. తన ప్రొఫైల్ తో పాటూ ఐడీ కార్డు, పే స్లిప్స్, అపాయింట్మెంట్ లెటర్ పంపిస్తూ అత్యుత్సాహాం ప్రదర్శించాడు మోసపూరిత మాటలతో ఆ యువతిని నమ్మించడానికి ప్రయత్నించాడు. ఆమెకు అనుమానం వచ్చి గట్టిగా అడిగింది. దాంతో అతని నిజస్వరూపం బయట పడింది. మెల్లిగా బెదిరింపులకు దిగాడు. ఇంకా అనుమానం పెరిగిపోయింది.

ఇక మోస పోతాననే భయంతో జవహర్ నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ బిక్షపతి రావు ను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకుంది. వెంటనే స్పందించిన సీఐ బిక్షపతి రావు ఇన్వెస్టిగేషన్ చేయగా యువకుడి వివరాలు ఫేక్ అని తేలింది. దీంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంటల్లో నిందితున్ని పట్టుకున్నారు. మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వీధిలో నివాసం ఉంటున్న వుప్పల హరి ప్రసాద్ గా గుర్తించి, అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Tags:    

Similar News