నకిలీ పత్తి వితనాల పట్టివేత
దిశ, రంగారెడ్డి: జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు కలకలం సృష్టిస్తున్నాయి. కందుకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ముఠాను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. నిందితుల నుంచి రూ. 5 లక్షల విలువైన బిల్లా, రఘు, కావ్య, అరుణోదయ, పావని, మేఘన-45 రకాలకు చెందిన విత్త ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మన్యం లక్ష్మీనారాయణ, పంజారి యూసిఫ్ బాషా, […]
దిశ, రంగారెడ్డి: జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు కలకలం సృష్టిస్తున్నాయి. కందుకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ముఠాను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. నిందితుల నుంచి రూ. 5 లక్షల విలువైన బిల్లా, రఘు, కావ్య, అరుణోదయ, పావని, మేఘన-45 రకాలకు చెందిన విత్త ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మన్యం లక్ష్మీనారాయణ, పంజారి యూసిఫ్ బాషా, మాల దాసిరి సురేశ్, వెంపటి భచ్చిలు ముఠాగా ఏర్పడి నకిలీ పత్తి విత్తనాలను అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.