ఆన్‌లైన్ పాలసీలకు గడువు పెంపు.!

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో సాధారణ కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీమా సంస్థలు పాలసీదారుల ఆన్‌లైన్ పాలసీలకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ ఐఆర్‌డీఏఐ వెసులుబాటు ఇచ్చింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన మార్పులు లేనందున దీన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. కరోనా వ్యాప్తి వల్ల ఆగష్టులో ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్ పాలసీలకు ఐఆర్‌డీఏఐ అనుమతులు ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఇటు పాలసీదారులు, బీమా కంపెనీలు సంతృప్తి పడ్డాయి. దీన్ని […]

Update: 2020-11-16 03:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో సాధారణ కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీమా సంస్థలు పాలసీదారుల ఆన్‌లైన్ పాలసీలకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ ఐఆర్‌డీఏఐ వెసులుబాటు ఇచ్చింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన మార్పులు లేనందున దీన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది.

కరోనా వ్యాప్తి వల్ల ఆగష్టులో ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్ పాలసీలకు ఐఆర్‌డీఏఐ అనుమతులు ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఇటు పాలసీదారులు, బీమా కంపెనీలు సంతృప్తి పడ్డాయి. దీన్ని మరో మూడు నెలల పెంచుతూ 2021, మార్చి 31 వరకు అనుమతుల కోసం ఉత్తర్వులు జారీ చేసింది. జీవిత బీమా పాలసీదారుల నుంచి వస్తున్న స్పందన, బీమా సంస్థలు దీనికి సిద్ధంగా ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ఐఆర్‌డీఏఐ అన్ని బీమా పాలసీలకు గడువును పెంచుతున్నట్టు తెలిపింది. ఆన్‌లైన్ పాలసీల కోసం డిజిటల్ సంతకం, లింక్ ధృవీకరణ, ఓటీపీ నిర్ధారణ.. ఈ మూడింటిలో ఏదొక దాని ద్వారా వినియోగదారులు పాలసీలను ప్రారంభించే అవకాశముంది.

Tags:    

Similar News