ఫేస్‌బుక్ పరిచయం.. వాట్సాప్ న్యూడ్ వీడియో కాల్స్.. పోలీస్ స్టేషన్‌‌లో ఏం జరిగిందంటే!

దిశ, ఏపీ బ్యూరో: ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా ఫోన్‌ నంబర్లు మార్చుకునేంత వరకు వెళ్లింది. ఆ తర్వాత వాట్సాప్‌లో చాటింగ్ చేసుకోవడం ఆ తర్వాత న్యూడ్‌కాల్స్ చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత సీన్‌లోకి ఓ వ్యక్తి వచ్చాడు. చాట్ చేసిన యువకుడికి ఫోన్ చేసి న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా… అలా చేయకూడదంటే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. అలా ఒకసారి […]

Update: 2021-12-02 03:55 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా ఫోన్‌ నంబర్లు మార్చుకునేంత వరకు వెళ్లింది. ఆ తర్వాత వాట్సాప్‌లో చాటింగ్ చేసుకోవడం ఆ తర్వాత న్యూడ్‌కాల్స్ చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత సీన్‌లోకి ఓ వ్యక్తి వచ్చాడు. చాట్ చేసిన యువకుడికి ఫోన్ చేసి న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా… అలా చేయకూడదంటే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. అలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు అతడి జేబు ఖాళీ చేసేశాడు. ఈసారి భారీ మెుత్తంలో డిమాండ్ చేయడంతో చేసేది లేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళగిరి మండలంలోని కురగల్లుకు చెందిన కడియం రాజేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఇటీవలే తనకు ఫేస్ బుక్‌లో ఓ యువతి పరిచయం అయ్యింది. దీంతో ఆ యువతితో ఫేస్‌బుక్‌లో చాట్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ ఫోన్‌నంబర్లు మార్చుకున్నారు.

వాట్సాప్‌లో ఇద్దరూ చాటింగ్ చేసుకునేవారు. వీడియోకాల్స్ కూడా మాట్లాడుకునేవారు. అంతేకాదు ఇద్దరు ఒకరికొకరు న్యూడ్ వీడియోలతో చాటింగ్ చేసుకున్నారు. ఇంతలో ఓ యువకుడు రాజేష్ కు ఫోన్ చేశాడు. మీ న్యూడ్ వీడియోలన్నీ మా దగ్గర ఉన్నాయని డబ్బులు పంపాలంటూ డిమాండ్ చేశాడు. కొద్ది రోజులుగా విడతల వారీగా కొంత నగదు పంపిన రాజేష్ యువకుడి వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయాడు. ఈసారి భారీగా నగదు పంపాలని డిమాండ్ చేయడంతో చేసేది ఏం లేక లబోదిబోమంటూ మంగళగిరి రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఆ యువతే టెక్నికల్‌గా వీడియోలను రికార్డ్ చేసి వేరే యువకుడితో ఇలా డబ్బులు వసూలు చేయిస్తుందని పోలీసుల ఎదుట రాజేష్ తన అనుమానం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులతో చాటింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమని.. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

Tags:    

Similar News