ఫేస్‌బుక్ యూజర్లకే కాదు.. సీఈవోకు తప్పని డేటా లీక్

దిశ, ఫీచర్స్ : ఇటీవల కాలంలో పలు యాప్స్‌కు సంబంధించి యూజర్ల పర్సనల్ డేటా లీకేజీ పెద్ద ఇష్యూగా మారింది. ఫేస్‌బుక్ నుంచి వందకు పైగా దేశాల 533 మిలియన్ యూజర్ల పర్సనల్ డీటెయిల్స్ ఆన్‌లైన్‌లో లీకైనట్లు వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే. అందులో ఎఫ్‌బీ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కూడా ఉన్నారని, ఆయన వ్యక్తిగత వివరాలు (ఫోన్ నెంబర్, ఇతర విషయాలు) లీకైనట్లు సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ డేవ్ వాకర్ తాజాగా వెల్లడించారు. అంతేకాదు […]

Update: 2021-04-05 04:48 GMT

దిశ, ఫీచర్స్ : ఇటీవల కాలంలో పలు యాప్స్‌కు సంబంధించి యూజర్ల పర్సనల్ డేటా లీకేజీ పెద్ద ఇష్యూగా మారింది. ఫేస్‌బుక్ నుంచి వందకు పైగా దేశాల 533 మిలియన్ యూజర్ల పర్సనల్ డీటెయిల్స్ ఆన్‌లైన్‌లో లీకైనట్లు వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే. అందులో ఎఫ్‌బీ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కూడా ఉన్నారని, ఆయన వ్యక్తిగత వివరాలు (ఫోన్ నెంబర్, ఇతర విషయాలు) లీకైనట్లు సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ డేవ్ వాకర్ తాజాగా వెల్లడించారు. అంతేకాదు ఫేస్‌బుక్ కో ఫౌండర్స్ క్రిస్ హ్యుగ్స్, డస్టిన్ మొస్కొవిచ్ డేటా కూడా లీకైందని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ‘#FacebookLeak హ్యాష్‌ట్యాగ్‌తో 533 మిలియన్ యూజర్స్ వ్యక్తిగత వివరాలు మాత్రమే కాదు.. ఎఫ్‌బీ ఫౌండర్, సీఈవో, కో-ఫౌండర్స్ పర్సనల్ డీటెయిల్స్ లీక్ అయ్యాయి’ అంటూ వ్యంగంగా ట్వీట్ చేశాడు వాకర్. అయితే ఈ లీకేజ్ ఇప్పుడు జరిగింది కాదని, ఆగస్టు 2019లో జరిగిందని ఫేస్‌బుక్ స్పోక్స్ పర్సన్ వివరణ ఇచ్చాడు.

Tags:    

Similar News