టీటీడీ ‘క‌ల్యాణమ‌స్తు’ ద‌ర‌ఖాస్తుల గడువు పొడిగింపు

దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే క‌ల్యాణమ‌స్తు సామూహిక వివాహ‌ల దరఖాస్తు గడువును పెంచింది. ఆసక్తి గ‌ల అవివాహితులైన యువ‌తీ యువ‌కులు ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని టీటీడీ కోరింది. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల ప్రధాన న‌గ‌రాల‌తో పాటు తిరుప‌తిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల‌ని టీటీడీ నిర్ణయించింది. కాగా, క‌ల్యాణమ‌స్తు సామూహిక వివాహ‌లకు సంబంధించిన విధివిధానాలు, ద‌ర‌ఖాస్తు ప‌త్రములు www.tirumala.org నుండి కానీ, ఆయా జిల్లాల హిందూ ధ‌ర్మ […]

Update: 2021-04-26 06:32 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే క‌ల్యాణమ‌స్తు సామూహిక వివాహ‌ల దరఖాస్తు గడువును పెంచింది. ఆసక్తి గ‌ల అవివాహితులైన యువ‌తీ యువ‌కులు ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని టీటీడీ కోరింది. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల ప్రధాన న‌గ‌రాల‌తో పాటు తిరుప‌తిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల‌ని టీటీడీ నిర్ణయించింది.

కాగా, క‌ల్యాణమ‌స్తు సామూహిక వివాహ‌లకు సంబంధించిన విధివిధానాలు, ద‌ర‌ఖాస్తు ప‌త్రములు www.tirumala.org నుండి కానీ, ఆయా జిల్లాల హిందూ ధ‌ర్మ ప్రచార ప‌రిష‌త్ ప్రోగ్రాం అసిస్టెంట్స్ నుండి పొంద‌వ‌చ్చు. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను ఏప్రిల్ 30వ తేదీ లోపు ఆయా జిల్లా కేంద్రాల‌ల్లోని క‌ల్యాణ మండ‌పాల కార్యా‌ల‌యాల్లో అందజేయాల్సి ఉంటుంది. కాగా, మే 28వ తేదీ టీటీడీ క‌ల్యాణమ‌స్తు సామూహిక వివాహ‌లను నిర్వహించ‌నున్న విష‌యం విదిత‌మే.

Tags:    

Similar News