గాల్వన్ లోయ నుంచి అందుకే వెళ్తున్నాం: చైనా

దిశ, వెబ్‌డెస్క్: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు తమ సైన్యం అనుగుణంగా చర్యలు తీసుకుంటుందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ అన్నారు. సరిహద్దులో నుంచి చైనా బలగాలు వెనక్కి తగ్గిన విషయంపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఝావో మాట్లాడుతూ.. ఘర్షణలను నివారించే క్రమంలో సంయమనం పాటించడం ద్వారా ఇరు దేశాలు మరింత పురోగతి సాధించాయని చెప్పారు. సరిహద్దు ఘర్షణ వాతావరణాన్ని నివారించేందుకు భారత్‌ కూడా సహకరించాలన్నారు. గతంలో ఇరు […]

Update: 2020-07-06 08:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు తమ సైన్యం అనుగుణంగా చర్యలు తీసుకుంటుందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ అన్నారు. సరిహద్దులో నుంచి చైనా బలగాలు వెనక్కి తగ్గిన విషయంపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఝావో మాట్లాడుతూ.. ఘర్షణలను నివారించే క్రమంలో సంయమనం పాటించడం ద్వారా ఇరు దేశాలు మరింత పురోగతి సాధించాయని చెప్పారు. సరిహద్దు ఘర్షణ వాతావరణాన్ని నివారించేందుకు భారత్‌ కూడా సహకరించాలన్నారు. గతంలో ఇరు దేశాల కమాండర్ల స్థాయిలో చర్చలు ఫలించాయని ఆయన వెల్లడించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు భవిష్యత్తులో కూడా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఝావో లిజియాన్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News