భూ కబ్జాలను అడ్డుకోవాలని.. తహశీల్దార్‌కు ఫిర్యాదు
దిశ, కుత్బుల్లాపూర్: ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ సోమవారం తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గాజులరామారం సర్కిల్ సర్వేనెంబర్ 342 లోని ప్రభుత్వ భూమిలో కొందరు ఆక్రమణదారులు 40 ఫీట్ల రోడ్డును వేస్తున్నారని, దాని అడ్డుకోవాలని ఆయన స్థానికులతో కలిసి తహశీల్దార్ వినయ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలంలో రోడ్డును ఎలా వేస్తారని ప్రశ్నించారు. అదే విధంగా పలు సర్వే నెంబర్లలో […]
దిశ, కుత్బుల్లాపూర్: ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ సోమవారం తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గాజులరామారం సర్కిల్ సర్వేనెంబర్ 342 లోని ప్రభుత్వ భూమిలో కొందరు ఆక్రమణదారులు 40 ఫీట్ల రోడ్డును వేస్తున్నారని, దాని అడ్డుకోవాలని ఆయన స్థానికులతో కలిసి తహశీల్దార్ వినయ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలంలో రోడ్డును ఎలా వేస్తారని ప్రశ్నించారు. అదే విధంగా పలు సర్వే నెంబర్లలో స్థలాలు కూడా కబ్జాకు గురవుతున్నాయని అన్నారు. భూ కబ్జాలను అడ్డుకట్ట వేయాలని కోరారు. లేని పక్షంలో భూ పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు.