ఇసుక మాఫియా దుర్మార్గంపై సమగ్ర విచారణ చేపట్టాలి

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఇసుక మాఫియా ఆగడాలకు బలైన నర్సింహులు ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే మల్లురవి డిమాండ్ చేశారు. రాజపూర్ మండలంలోని తిరుమలపూర్‌లో జరిగిన ఇసుక మాఫియా సంఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఒక పేద షెడ్యూల్డ్ కుల వ్యక్తి నరసింహ మరణం చాలా తీవ్రమైందని, ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ పూర్తి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే నరసింహులు కుటుంబ సభ్యులకు రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా […]

Update: 2020-07-30 09:13 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఇసుక మాఫియా ఆగడాలకు బలైన నర్సింహులు ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే మల్లురవి డిమాండ్ చేశారు. రాజపూర్ మండలంలోని తిరుమలపూర్‌లో జరిగిన ఇసుక మాఫియా సంఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఒక పేద షెడ్యూల్డ్ కుల వ్యక్తి నరసింహ మరణం చాలా తీవ్రమైందని, ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ పూర్తి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే నరసింహులు కుటుంబ సభ్యులకు రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలలో దళితుల మరణాల పరంపర జరుగుతుందనే విషయాన్ని కూడా గమనించాలన్నారు. రాష్ట్రంలోని మొత్తం పరిస్థితిని సమీక్షించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు.

Tags:    

Similar News