మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు
దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయనతో పాటు కుమారుడు అస్మిత్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని అనంతపురం తరలించినట్టు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే..జేసీ ట్రావెల్స్‌కు చెందిన 154బస్సులకు నకిలీ ఎన్‌వోసీ(ఫేక్ ఇన్సూరెన్స్)లు సృష్టించి నడిపిస్తున్న ఆరోపణల మేరకు అరెస్టు చేసినట్టు సమాచారం. రవాణాశాఖ అధికారులు జరిపిన విచారణలో కొత్త విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. నకిలీ డాక్యూమెంట్లతో […]
దిశ, వెబ్‌డెస్క్:
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయనతో పాటు కుమారుడు అస్మిత్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని అనంతపురం తరలించినట్టు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే..జేసీ ట్రావెల్స్‌కు చెందిన 154బస్సులకు నకిలీ ఎన్‌వోసీ(ఫేక్ ఇన్సూరెన్స్)లు సృష్టించి నడిపిస్తున్న ఆరోపణల మేరకు అరెస్టు చేసినట్టు సమాచారం. రవాణాశాఖ అధికారులు జరిపిన విచారణలో కొత్త విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. నకిలీ డాక్యూమెంట్లతో బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారని గుర్తించారు. దీంతో జేసీ ట్రావెల్స్ పై ఫోర్జరీ కేసులు పెట్టామన్నారు. అదేవిధంగా 76బస్సుల రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్టు ఏపీ రవాణా శాఖ తెలిపింది. ప్రస్తుతానికి 60వాహనాలను సీజ్ చేశామన్నారు. మిగతా 94బస్సులను జేసీ బ్రదర్స్ దాచిపెట్టినట్టు అధికారులు గుర్తించారు. లారీలను బస్సులుగా మార్చి నడిపిస్తున్నారని కూడా విచారణలో తేలింది. ఇకమీదట జేసీ ట్రావెల్స్‌లో ప్రయాణించేవారికి ఇన్సూరెన్స్ వర్తించదని అధికారులు తేల్చిచెప్పారు.