వాటాల్లో తేడాలొచ్చి పంపిణీ ఆపేశారు : నక్కా
దిశ, అమరావతి బ్యూరో : ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ పేరుతో వైసీపీ నేతలు భారీ అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆరోపించారు. పార్టీ నేతల వాటాల్లో తేడాలు తలెత్తడం వల్లే ఇప్పటికి 3 సార్లు వాయిదా వేశారని విమర్శించారు. పేదలకు ఇచ్చే ఇళ్ళ స్థలాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం దీక్షకు దిగారు. ఈ సందర్బంగా నక్కా మాట్లాడుతూ..ఇళ్ళ స్థలాల అంశంలో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. […]
దిశ, అమరావతి బ్యూరో : ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ పేరుతో వైసీపీ నేతలు భారీ అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆరోపించారు. పార్టీ నేతల వాటాల్లో తేడాలు తలెత్తడం వల్లే ఇప్పటికి 3 సార్లు వాయిదా వేశారని విమర్శించారు. పేదలకు ఇచ్చే ఇళ్ళ స్థలాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం దీక్షకు దిగారు. ఈ సందర్బంగా నక్కా మాట్లాడుతూ..ఇళ్ళ స్థలాల అంశంలో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం పంచే ఇళ్ళ స్థలాలను టీడీపీ అడ్డుకుందని చెప్పడం సరికాదన్నారు. అయితే, బుధవారం స్థలాల పంపిణీ చేయాల్సి వుండగా కరోనా ఉధృతి నేపథ్యంలో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేయగా, తాజాగా ఆగష్టు 15న పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.