బ్రేకింగ్: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర మళ్లీ అరెస్ట్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా.. నిన్న రవీంద్ర, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఎస్సైపై చేయిచేసుకుని ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై కొల్లు రవీంద్రపై కేసు నమోదు అయింది. ఈ కేసుకి సంబంధించి ఇవాళ మచిలీపట్నంలో కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. కొల్లు రవీంద్ర ఇంటికి పోలీసులు చేరుకోవడంతో.. పెద్ద ఎత్తున అభిమానులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. […]
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర మళ్లీ అరెస్ట్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా.. నిన్న రవీంద్ర, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఎస్సైపై చేయిచేసుకుని ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై కొల్లు రవీంద్రపై కేసు నమోదు అయింది. ఈ కేసుకి సంబంధించి ఇవాళ మచిలీపట్నంలో కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు.
కొల్లు రవీంద్ర ఇంటికి పోలీసులు చేరుకోవడంతో.. పెద్ద ఎత్తున అభిమానులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. పోలీసుల తీరుపై రవీంద్ర వర్గీయులు మండిపడుతున్నారు. కాగా, గతంలో ఒక కేసులో కొల్లు రవీంద్ర అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.