హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు అరెస్ట్

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆయన మీద మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రవీంద్ర అజ్ఞాతంలోకి వెళ్లారు. శుక్రవారం ఉదయం పోలీసులు ఆయకు అరెస్ట్ వారెంట్ జారీ చేసేందుకు వెళ్లగా ఆయన ఇంట్లో లేరని తెలిసింది. అప్పటి నుంచి ఆయన ఆచూకీ కోసం మూడు బృందాలతో గాలింపు చేపట్టారు. కాగా విశాఖపట్నం […]

Update: 2020-07-03 10:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆయన మీద మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రవీంద్ర అజ్ఞాతంలోకి వెళ్లారు. శుక్రవారం ఉదయం పోలీసులు ఆయకు అరెస్ట్ వారెంట్ జారీ చేసేందుకు వెళ్లగా ఆయన ఇంట్లో లేరని తెలిసింది. అప్పటి నుంచి ఆయన ఆచూకీ కోసం మూడు బృందాలతో గాలింపు చేపట్టారు. కాగా విశాఖపట్నం వైపు వెళ్తున్న కొల్లు రవీంద్రను మఫ్టీలో ఉన్న కృష్ణా జిల్లా పోలీసులు తుని మండలం సీతరాంపురం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ తరలించారు. కాగా భాస్కర్ రావు హత్య కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులను శుక్రవారం డీఎస్పీ మహమూద్ బాషా మీడియా ముందుకు తీసుకువచ్చారు. కొల్లు రవీంద్ర ప్రొద్బలంతోనే హత్య చేసినట్లు వారు తెలిపారని, దీనిపై సైంటిఫిక్ ఆధారాలు కూడా సేకరించాంమని డీఎస్పీ తెలిపారు.

Tags:    

Similar News