సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్‌ వార్నింగ్

దిశ, హుజూరాబాద్ రూరల్: దిగజారుడుతనానికి మారుపేరు కేసీఆర్ అంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. మంగళవారం ఉపఎన్నిక నేపథ్యంలో హుజూరాబాద్ మండలం జూపాక, బొత్తలపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో ఏం చేయలేవనేది ప్రజలకు అర్థం అయింది అంటూ ఎద్దేవా చేశారు. తనను ఎదుర్కోలేక దొంగ ఉత్తరం సృష్టించి ప్రచారం చేసుకుంటున్నారని, కేసీఆర్ తోడేళ్ళ గుంపును పంపించి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అంటూ ఈటల ఆరోపించారు. హుజూరాబాద్ ఉప […]

Update: 2021-10-05 11:58 GMT

దిశ, హుజూరాబాద్ రూరల్: దిగజారుడుతనానికి మారుపేరు కేసీఆర్ అంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. మంగళవారం ఉపఎన్నిక నేపథ్యంలో హుజూరాబాద్ మండలం జూపాక, బొత్తలపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో ఏం చేయలేవనేది ప్రజలకు అర్థం అయింది అంటూ ఎద్దేవా చేశారు. తనను ఎదుర్కోలేక దొంగ ఉత్తరం సృష్టించి ప్రచారం చేసుకుంటున్నారని, కేసీఆర్ తోడేళ్ళ గుంపును పంపించి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అంటూ ఈటల ఆరోపించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ కోరుకుంటే వచ్చిన ఎన్నిక అని రాజేందర్ అన్నారు. పదవుల కోసం కాదు.. త్యాగం కోసం వచ్చినవాడిననీ.. విలువలేనికాడ ఎందుకని రాజీనామా చేసి వచ్చానన్నారు. రాజేంద్ర నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు అని అవమానించిన కుంగిపోకుండా.. ఉద్యమంలో పాల్గొన్న వాడినని గుర్తు చేశారు. చిల్లర రాజకీయాలు మానుకో.. హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచే నీ పతనం ప్రారంభం అవుతుందని ఈటల కేసీఆర్‌ను హెచ్చరించారు.

Tags:    

Similar News