తిన్నింటికే కన్నం..మాజీ బ్యాంక్ మేనేజర్ అరెస్టు
దిశ, క్రైమ్ బ్యూరో : తిన్నింటి వాసాలు లెక్కెట్టిన ఓ మాజీ బ్యాంకు మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, సరైన డాక్యుమెంట్లు లేకుండానే సీసీ-ఓడీ అకౌంట్లను ఓపెన్ చేసి పరిమితికి మించి రుణాలు మంజూరు చేశాడనేది అతనిపై ఉన్న ప్రధాన ఆరోపణ. హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని ఎస్బీఐ బ్యాంకులో ఏడాది కిందట జరిగిన ఈ ఘటనపై ప్రస్తుత మేనేజర్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకివెళితే..రెడ్‌హిల్స్ ఎస్బీఐ బ్రాంచ్‌లో 2018 జూన్ 27 నుంచి […]
దిశ, క్రైమ్ బ్యూరో :
తిన్నింటి వాసాలు లెక్కెట్టిన ఓ మాజీ బ్యాంకు మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, సరైన డాక్యుమెంట్లు లేకుండానే సీసీ-ఓడీ అకౌంట్లను ఓపెన్ చేసి పరిమితికి మించి రుణాలు మంజూరు చేశాడనేది అతనిపై ఉన్న ప్రధాన ఆరోపణ. హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని ఎస్బీఐ బ్యాంకులో ఏడాది కిందట జరిగిన ఈ ఘటనపై ప్రస్తుత మేనేజర్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకివెళితే..రెడ్‌హిల్స్ ఎస్బీఐ బ్రాంచ్‌లో 2018 జూన్ 27 నుంచి 2019 మార్చి 13 వరకూ జొన్నలగడ్డ దీపక్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేశాడు.ఈయన హయాంలో బ్యాంకు నిబంధనలు పాటించకుండా, సరైన పత్రాలు లేకుండా 130 మంది వినియోగదారులకు సీసీ-ఓడీ అకౌంట్‌లు తెరిచేందుకు అనుమతి ఇచ్చాడు. అంతే కాకుండా ఖాతాదారుల పరిమితికి మించి మొత్తం రూ.10.19 కోట్ల రుణాలను మంజూరు చేశాడు. సదరు వినియోగదారులు ఆ రుణాలను సక్రమంగా చెల్లించనందున రూ.1.75 కోట్లు మొండి బకాయిలుగా పేరుకుపోయాయి. దీంతో నాటి మేనేజర్ దీపక్ బ్యాంకును మోసం చేశాడని ప్రస్తుత రెడ్ హిల్స్ ఎస్భీఐ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీఎస్ డిటెక్టివ్ విభాగం ఏసీపీ ఎన్.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఇన్ స్పెక్టర్ పి.ఆంజనేయులు, ఎస్ఐ పి.శ్రీనివాసులు, పీసీ రమావత్ రమేష్ నాయక్ కేసును దర్యాప్తు చేసి మాజీ మేనేజర్‌పై ఐపీసీ 420, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు తెలిపారు.