డీఆర్‌డీఏ, మహిళా సంఘాలతో సరికొత్త కార్యక్రమం : శ్రీనివాస్ గౌడ్

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ప్రతీ ఒక్కరూ ఇల్లు కట్టడానికి ముందే మొక్కలు నాటుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు వెంబడి బహుళ వరుసలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రానున్న వారం పది రోజులలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రిని ఆహ్వానించి హరితహారం […]

Update: 2021-06-18 05:37 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ప్రతీ ఒక్కరూ ఇల్లు కట్టడానికి ముందే మొక్కలు నాటుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు వెంబడి బహుళ వరుసలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రానున్న వారం పది రోజులలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రిని ఆహ్వానించి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జిల్లాలో రికార్డు స్థాయిలో మొక్కలు నాటేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. గతంలో కోటిన్నర విత్తన బంతులను తయారుచేసి గిన్నిస్ బుక్ రికార్డును సాధించడం జరిగిందని, ఆ రికార్డును మనమే అధిగమించేలా ఈ ఏడాది డీఆర్‌డీఏ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో రెండు కోట్ల విత్తన బంతులను తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

నాటిన ప్రతీ మొక్క బతికే విధంగా తగిన చర్యలు చేపడతామన్నారు. మున్సిపాలిటీలలో పార్కులను ఏర్పాటు చేసి వాటిని అందంగా రూపొందిస్తామన్నారు. బైపాస్ రోడ్డు మధ్యలోనూ మొక్కలు నాటడానికి తగు చర్యలు చేపట్టాలని మంత్రి మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.

 

Tags:    

Similar News