చచ్చినా సరే.. ఆ పని చేయకండి..! పోలీసుల వినూత్న ప్రచారం

దిశ, వెబ్‌డెస్క్ : హలో సర్.. మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. కాస్త చూసి చెప్పగలరా.. అంటూ సైబర్ నేరగాళ్లు కాల్ చేసి లక్షలు దోచేస్తు్న్నారు. ఇలాంటి కేసులు నిత్యం జరుగుతుండటంతో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేసేందుకు వివిధ రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు. అయితే దీనిపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. పోస్ట్‌లో ఉన్న ప్రకారం తెలుగులో ‘‘హెచ్చరిక! మీరు ఓటీపీ వచ్చేదాకా వేచి చూడండి. ఏం పర్లేదు […]

Update: 2021-09-02 09:22 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హలో సర్.. మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. కాస్త చూసి చెప్పగలరా.. అంటూ సైబర్ నేరగాళ్లు కాల్ చేసి లక్షలు దోచేస్తు్న్నారు. ఇలాంటి కేసులు నిత్యం జరుగుతుండటంతో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేసేందుకు వివిధ రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు. అయితే దీనిపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. పోస్ట్‌లో ఉన్న ప్రకారం తెలుగులో ‘‘హెచ్చరిక! మీరు ఓటీపీ వచ్చేదాకా వేచి చూడండి. ఏం పర్లేదు కానీ..! ‘చచ్చినా’ అపరిచిత వ్యక్తులకు చెప్పకండి’’ అని ఉంది. ఇంగ్లిష్‌‌లో ‘‘ wait until you die for OTP. But, Do not say ‘OTP’ to strangers even you dead.’’ అని పోస్ట్ చేశారు. ఈ పోస్టు ఎంతో ఆలోచింపజేసే విధంగా ఉండటంతో పాటు.. అలర్ట్ చేసే విధంగా ఉందని నెటిజన్లు రీ ట్వీట్ చేస్తున్నారు.

Tags:    

Similar News