‘నిస్వార్ధం, నీతి, నిజాయితీ గల నాయకుడు ఈటల’

దిశ,హుజురాబాద్: మామూలు రైతు కుటుంబంలో పుట్టి కింది స్థాయి నుండి ఎంతో కష్టపడి స్వతహాగా ఎదిగిన నాయకుడు ఈటల రాజేందర్ అని జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ…1986 నుండే పౌల్ట్రీ రంగంలో అడుగు పెట్టి, అంచలంచలుగా ఎదిగి ఈరోజు అందరూ గౌరవించే స్థాయికి ఎదిగిన వ్యక్తి మంత్రి ఈటల రాజేందర్ అని పేర్కొన్నారు. ‘ఆ రోజుల్లో కూడా ఎవరి దగ్గర రూపాయి […]

Update: 2021-05-01 08:38 GMT

దిశ,హుజురాబాద్: మామూలు రైతు కుటుంబంలో పుట్టి కింది స్థాయి నుండి ఎంతో కష్టపడి స్వతహాగా ఎదిగిన నాయకుడు ఈటల రాజేందర్ అని జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ…1986 నుండే పౌల్ట్రీ రంగంలో అడుగు పెట్టి, అంచలంచలుగా ఎదిగి ఈరోజు అందరూ గౌరవించే స్థాయికి ఎదిగిన వ్యక్తి మంత్రి ఈటల రాజేందర్ అని పేర్కొన్నారు. ‘ఆ రోజుల్లో కూడా ఎవరి దగ్గర రూపాయి ఆశించని మనిషి, ప్రతినిత్యం ఎన్నో వేల రూపాయలు సహాయం చేస్తూ, ఎంతో మంది విద్యార్థులకు ఫీజులు కట్టి చదివిస్తున్న నాయకుడు మంత్రి ఈటల’ అని అయన తెలిపారు.

కష్టం వచ్చిందంటే నేనున్నా అనే వ్యక్తి ఈటల రాజేందర్ అని, అలాంటి మనిషిపై ఈరోజు కబ్జాదారుడు అనే ముద్ర వేసి, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే కుట్రలు జరుగుతున్నాయని సమ్మిరెడ్డి అన్నారు. అలాంటివి హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు ఎవరు కూడా సహించరని, రాష్ట్రంలో ఎన్నో అసైన్డ్ భూములు కబ్జాకు గురి అయ్యాయని, వాటిపై కూడా విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News