ఎస్కార్ట్ గన్ దొంగతనం..పాత నేరస్థుడు అరెస్టు
దిశ, నిజామాబాద్: ఎస్కార్ట్ పోలీసులకు మస్కా కొట్టి సర్వీసు తుపాకితో పరారైన పాత నేరస్థుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. 60రోజుల పాటు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసి, ఇద్దరు ఏఆర్ పోలీసుల సస్పెన్షన్‌కు కారకుడైన పాత నేరస్థుడిని నిజామాబాద్ ఓకటో టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని, తుపాకిని స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకివెళితే..నిజామాబాద్ పట్టణంలోని గౌతం నగర్‌కు చెందిన జీలకర ప్రసాద్ చిన్నచితకా నేరాలు చేసేవాడు. జిల్లాలోని మాక్లూర్ మండలం పరిధిలోని వ్యవసాయ క్షేత్రాల వద్దనున్న […]
దిశ, నిజామాబాద్: ఎస్కార్ట్ పోలీసులకు మస్కా కొట్టి సర్వీసు తుపాకితో పరారైన పాత నేరస్థుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. 60రోజుల పాటు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసి, ఇద్దరు ఏఆర్ పోలీసుల సస్పెన్షన్‌కు కారకుడైన పాత నేరస్థుడిని నిజామాబాద్ ఓకటో టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని, తుపాకిని స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకివెళితే..నిజామాబాద్ పట్టణంలోని గౌతం నగర్‌కు చెందిన జీలకర ప్రసాద్ చిన్నచితకా నేరాలు చేసేవాడు. జిల్లాలోని మాక్లూర్ మండలం పరిధిలోని వ్యవసాయ క్షేత్రాల వద్దనున్న ట్రాన్స్‌పార్మర్ల కాయిల్స్ చోరీ కేసులో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిజామాబాద్ జిల్లా జైలు(సారంగపూర్)లో ఉన్న నేరస్థుడు తనకు కడుపు నొప్పి అధికంగా ఉందని జైలు అధికారులను నమ్మించారు. అది నమ్మిన జైలు అధికారులు హెడ్ కానిస్టేబుల్ గాంధీ, కానిస్టేబుల్ ప్రసాద్‌లను అతనికి ఎస్కార్టుగా ఏర్పాటుచేసి జిల్లా జనరల్ అస్పత్రికి ఏప్రిల్ 4వ తేదీ ఉదయం పంపించారు.
అదే రోజు రాత్రి ఎస్కార్ట్ ప్రసాద్ భోజనం కోసం జిల్లా ఆస్పత్రి నుంచి కిందకు వెళ్లాడు.అదే సమయంలో హెడ్ కానిస్టేబుల్ గాంధీని పక్కకు తోసి జీలకర ప్రసాద్ పోలీసులకు చెందిన షార్ట్ వెపన్ తీసుకుని పారిపోయాడు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో స్థానిక ఓకటో టౌన్ పీస్‌లో కేసు నమోదైంది. లాక్‌డౌన్ కాలంలో అతని కోసం ప్రత్యేకంగా టీంలుగా ఏర్పడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మహరాష్ట్రలో సైతం తనిఖీలు చేశారు. గన్‌తో పాటు నేరస్థుడు పారిపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎర్‌ఆర్ కానిస్టేబుల్ గాంధీ, ప్రసాద్ లను సస్పెన్షన్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం ఉదయం ఓకటో టౌన్ పోలీసులు గౌతం నగర్‌లో జీలకర ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు నిజామాబాద్ రూరల్ మండలం గుండారం శివారులోని ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన పొలంలో తుపాకి, 10 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.