నాటిన మొక్కలను బతికించుకుందాం: ఎర్రబెల్లి

దిశ, రంగారెడ్డి: హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటుతున్న మొక్కల్లో 85 శాతం వరకు బతికించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సోమవారం మంత్రి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలు ఇటీవల కొనుగోలు చేసిన ట్రాక్టర్ల ద్వారా ప్రతి రోజు మొక్కలకు నీరు పోయాలని ఆయన సూచించారు. అలాగే, ఉపాధి హామీ పనులు, కూలీల భద్రత, ఇంకుడు గుంతలు తదితర […]

Update: 2020-05-11 08:44 GMT

దిశ, రంగారెడ్డి: హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటుతున్న మొక్కల్లో 85 శాతం వరకు బతికించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సోమవారం మంత్రి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలు ఇటీవల కొనుగోలు చేసిన ట్రాక్టర్ల ద్వారా ప్రతి రోజు మొక్కలకు నీరు పోయాలని ఆయన సూచించారు. అలాగే, ఉపాధి హామీ పనులు, కూలీల భద్రత, ఇంకుడు గుంతలు తదితర అంశాలపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. సాధ్యమైనంత వరకు కూలీలకు ఉపాధి కల్పించాలని చెప్పారు. కొత్తగా వస్తున్న జాబ్ కార్డులు తక్షణమే జారీ చేయాలన్నారు. ఉపాధి పనులకు హాజరయ్యే కూలీలు తప్పని సరిగా భౌతిక దూరం పాటించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు స్పష్టం చేశారు.

Tags:    

Similar News