5జీకి మారేందుకు సిద్ధంగా 4 కోట్ల మంది
దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా త్వరలో 5జీ సేవలు ప్రారంభమవుతున్న తరుణంలో వేగవంతమైన కనెక్టివిటీని అందుకునేందుకు లక్షల మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త టెక్నాలజీ 5జీ నెట్‌వర్క్ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్‌లో 5జీ నెట్‌వర్క్ ప్రారంభమైన మొదటి ఏడాదిలోనే దానికి అప్‌గ్రేడ్ అయ్యేందుకు 4 కోట్ల మంది సిద్ధంగా ఉన్నట్టు ఎరిక్సన్ తన నివేదికలో తెలిపింది. ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారులపై 5జీ నెట్‌వర్క్ ప్రభావాన్ని కంపెనీ అధ్యయనం చేసింది. […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా త్వరలో 5జీ సేవలు ప్రారంభమవుతున్న తరుణంలో వేగవంతమైన కనెక్టివిటీని అందుకునేందుకు లక్షల మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త టెక్నాలజీ 5జీ నెట్‌వర్క్ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్‌లో 5జీ నెట్‌వర్క్ ప్రారంభమైన మొదటి ఏడాదిలోనే దానికి అప్‌గ్రేడ్ అయ్యేందుకు 4 కోట్ల మంది సిద్ధంగా ఉన్నట్టు ఎరిక్సన్ తన నివేదికలో తెలిపింది. ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారులపై 5జీ నెట్‌వర్క్ ప్రభావాన్ని కంపెనీ అధ్యయనం చేసింది. ఇప్పటికే దేశీయంగా టెలికాం దిగ్గజాలు 5జీ నెట్‌వర్క్‌ను పరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన ఏడాదిలోపు కనీసం 4 కోట్ల మంది సరికొత్త వేగవంతమైన నెట్‌వర్క్‌కు మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు తేలింది. అంతేకాకుండా, కొత్త డిజిటల్ సేవలను పొందేందుకు 5జీ ప్లాన్‌ల కోసం భారతీయ వినియోగదారులు 50 శాతం ఎక్కువ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు నివేదిక తెలిపింది.