ఆ పార్ట్ తొలగించుకున్న వారికే గ్రామంలోకి ఎంట్రీ..!
దిశ, వెబ్‌డెస్క్ : భారత దేశం భిన్న సంస్కృతులకు నిలయం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచార, సంస్కృతులు ఉంటాయి. ఏరియాలను బట్టి సంప్రదాయాలు ఉన్నా.. అక్కడికి వెళ్లే వారు కూడా ఆ ప్రదేశ ఆచార, కట్టుబాట్లనే పాటించాలనే నిబంధనలు సైతం విధించుకున్న ప్రాంతాలు ఉన్నాయి. అక్కడే జీవించాలంటే ఆ వ్యవహారాలను పాటించాల్సిందే. అయితే అంటార్కిటిక్ ప్రాంతంలోని ఓ గ్రామంలో నివాసించాలంటే శరీరంలో ఓ పార్ట్‌ను తొలగించుకోవాల్సిందేనట. గ్రామంలోకి ఎంట్రీకి ముందే అవసరమైన ధృవీకరణ ప్రతాలు సమర్పించాల్సిందే.. అంటార్కిటిక్‌లోని […]
దిశ, వెబ్‌డెస్క్ : భారత దేశం భిన్న సంస్కృతులకు నిలయం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచార, సంస్కృతులు ఉంటాయి. ఏరియాలను బట్టి సంప్రదాయాలు ఉన్నా.. అక్కడికి వెళ్లే వారు కూడా ఆ ప్రదేశ ఆచార, కట్టుబాట్లనే పాటించాలనే నిబంధనలు సైతం విధించుకున్న ప్రాంతాలు ఉన్నాయి. అక్కడే జీవించాలంటే ఆ వ్యవహారాలను పాటించాల్సిందే. అయితే అంటార్కిటిక్ ప్రాంతంలోని ఓ గ్రామంలో నివాసించాలంటే శరీరంలో ఓ పార్ట్‌ను తొలగించుకోవాల్సిందేనట. గ్రామంలోకి ఎంట్రీకి ముందే అవసరమైన ధృవీకరణ ప్రతాలు సమర్పించాల్సిందే..
అంటార్కిటిక్‌లోని విల్లాలాస్ ఎస్టార్లెస్ అనే గ్రామంలో ఈ వింత రూల్ ఉన్నది. ఇంతకూ ఆ గ్రామంలో ఉండాలంటే ఏ పార్ట్ తొలగించుకోవాలంటే.. ఆ గ్రామానికి వెళ్లే వారి శరీరంలో అపెండిక్స్ తొలగించుకోవాలట. నగర నాగరితకు దూరంగా నివసిస్తున్నారు ఈ గ్రామవాసులు. విల్లాలాస్ ఎస్టార్లెస్ గ్రామ జనభా మొత్తం 154 మంది. ఈ గ్రామంలో ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు. ఎవరికి ఏమైనా 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి వెళ్లాల్సిందే. అందుకే ఆ గ్రామానికి 2018 నుంచి కొన్ని కట్టుబాట్లును రూపొందించుకున్నారు. విల్లాలాస్ ఎస్టార్లెస్ గ్రామంలో నివసించాలంటే ఖచ్చితంగా అపెండిక్స్‌ను తొలగించుకోని రావాలి. దానిని తొలగించుకున్నట్లు వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని చూపిస్తేనే ఆ గ్రామంలోకి ఎంట్రీ ఉంటుంది. ఈ రూల్ పెట్టడానికి ప్రధాన కారణం వైద్య సదుపాయాలు లేకపోవడమేనట. అపెండిక్స్ వస్తే వెయ్యి కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రికి వెళ్లే సరికే ప్రాణాలు పోతున్నాయని ఈ నిబంధన విధించుకున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు.