టీ20 నుంచి వైదొలగిన జాస్ బట్లర్

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 (T20)లో ఇంగ్లాండ్ జట్టును గెలిపించిన జాస్ బట్లర్ చివరి టీ20 నుంచి వైదొలిగాడు. వ్యక్తిగత కారణాలతో అతడు బయోబబుల్ (Bio Bubble)నుంచి బయటకు వెళ్లిపోయాడు. మంగళవారం చివరి టీ20 జరుగనుంది. రెండో టీ20లో కేవలం 54 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇప్పుడీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మాన్ వైదొలగడంతో జానీ బారిస్ట్రో తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే మూడు మ్యాచ్‌ల వన్డే […]

Update: 2020-09-07 10:28 GMT

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 (T20)లో ఇంగ్లాండ్ జట్టును గెలిపించిన జాస్ బట్లర్ చివరి టీ20 నుంచి వైదొలిగాడు. వ్యక్తిగత కారణాలతో అతడు బయోబబుల్ (Bio Bubble)నుంచి బయటకు వెళ్లిపోయాడు. మంగళవారం చివరి టీ20 జరుగనుంది. రెండో టీ20లో కేవలం 54 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇప్పుడీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మాన్ వైదొలగడంతో జానీ బారిస్ట్రో తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

అయితే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు బట్లర్ అందుబాటులో ఉంటాడని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) స్పష్టం చేసింది. అయితే అంతకు ముందు అతడు కరోనా పరీక్ష చేయించుకోవాలని, అందులో నెగెటివ్ వస్తేనే వన్డేల్లో ఆడిస్తామని అన్నారు. ఇప్పటి వరకు కేవలం 15 టీ20లు మాత్రమే ఆడిన బట్లర్.. 50.84 యావరేజ్‌తో పరుగులు సాధించాడు. విరాట్ కొహ్లీ బ్యాటింగ్ యావరేజ్ కంటే జాస్ బట్లర్‌గే ఎక్కువ కావడం గమనార్హం.

క్రమం తప్పకుండా నిలకడగా రాణిస్తున్నా బట్లర్ ఇంగ్లాండ్ జట్టులో కీలక సభ్యుడిగా మాత్రం మారలేదు. ఈ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా రాణించడంతో అతడు తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. రాబోయే టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించాలని బట్లర్ భావిస్తున్నాడు.

Tags:    

Similar News