నిమ్మగడ్డ కేసులో రూ.33కోట్ల ఆస్తులు అటాచ్..

దిశ, క్రైమ్ బ్యూరో: తప్పుడు పత్రాలతో బ్యాంకును మోసం చేసి పెద్ద ఎత్తున రుణం పొందిన నిమ్మగడ్డ రామకృష్ణ, నిమ్మగడ్డ వేణుగోపాల్, వీవీఎన్‌కే విశ్వనాథ్, ఇతర కుటుంబ సభ్యుల ఆస్తులను మంగళవారం ఈడీ అటాచ్ చేసింది. ఏపీలోని గుడివాడ ప్రస్తత యూనియన్ బ్యాంక్ ఐండియా (పాత ఆంధ్రా బ్యాంకు) బ్రాంచ్ నుంచి గతంలో 470 ఎకరాల్లో ఫిష్ ఫామింగ్ పేరుతో నిమ్మగడ్డ రామకృష్ణ, వేణుగోపాల్, వీవీఎన్‌కె విశ్వనాథ్ తదితర కుటుంబ సభ్యుల పేర్లతో వీనస్ ఆక్వా ఫుడ్స్ […]

Update: 2020-10-21 11:00 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: తప్పుడు పత్రాలతో బ్యాంకును మోసం చేసి పెద్ద ఎత్తున రుణం పొందిన నిమ్మగడ్డ రామకృష్ణ, నిమ్మగడ్డ వేణుగోపాల్, వీవీఎన్‌కే విశ్వనాథ్, ఇతర కుటుంబ సభ్యుల ఆస్తులను మంగళవారం ఈడీ అటాచ్ చేసింది. ఏపీలోని గుడివాడ ప్రస్తత యూనియన్ బ్యాంక్ ఐండియా (పాత ఆంధ్రా బ్యాంకు) బ్రాంచ్ నుంచి గతంలో 470 ఎకరాల్లో ఫిష్ ఫామింగ్ పేరుతో నిమ్మగడ్డ రామకృష్ణ, వేణుగోపాల్, వీవీఎన్‌కె విశ్వనాథ్ తదితర కుటుంబ సభ్యుల పేర్లతో వీనస్ ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ పేరుతో రూ.19.44 కోట్లను ఫిష్ ట్యాంక్ లోన్లను పొందారు.

అంతే కాకుండా, ఫిష్ ఫామింగ్ కోసం బ్యాంకుకు చూపించిన 470 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ నకిలీవని విచారణలో తేలింది. దాదాపు 54 మంది వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పేర్లతో రూ.22.64 కోట్లను మరోసారి రుణం పొందారు. అయితే, ఈ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడమే కాకుండా, నిధులన్నీ పక్కదారి మళ్లించారని ఈడీ పేర్కొంది.

వ్యాపారంలో రూ.36.97 కోట్లు నష్టం రావడం కారణంగానే రుణం తిరిగి చెల్లించలేదన్నారు. దీంతో సీబీఐ విచారణలో ఆస్తులను అటాచ్ చేసేందుకు ఈ కేసు ఈడీ కి రాగా, హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లోని నిమ్మగడ్డ రామకృష్ణ, వేణుగోపాల్, వీవీఎన్‌కె విశ్వనాథ్ లకు సంబంధించిన రూ.11.05 కోట్ల ఆస్తులను మంగళవారం ఈడీ అటాచ్ చేసింది. వీటి విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం దాదాపు రూ.33.39 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. నిధులను పక్కదారి మళ్లించిన అంశంలో రూ.1.72 కోట్లు ‘ఆకాశమే హద్దు’అనే తెలుగు సినిమా కోసం ఖర్చు చేసినట్టు అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. వీరిపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం బ్యాంకు ను మోసం చేసిన కేసులో ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News