హోటళ్లలో ఉన్నవారిని తీసుకొచ్చి కాల్చారు !

దిశ, తెలంగాణ క్రైమ్​‌బ్యూరో: హోటళ్లలో ఉన్నవారిని తీసుకొచ్చి ములుగు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారని పౌర హక్కుల సంఘం నేతలు గడ్డం లక్ష్మణ్, ఎన్‌. నారాయణరావు విమర్శించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్​కౌంటర్లన్నీ చట్టబద్ద ఉల్లంఘన హత్యలుగా ప్రజాస్వామిక వాదులు భావించాలని కోరారు. 2015 నుంచి ములుగులో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్ వరకు నిజనిర్థారణకు బయలు దేరిన మానవహక్కుల వేదిక నాయకులను పోలీసులు నిర్బంధించి […]

Update: 2020-10-19 09:24 GMT

దిశ, తెలంగాణ క్రైమ్​‌బ్యూరో: హోటళ్లలో ఉన్నవారిని తీసుకొచ్చి ములుగు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారని పౌర హక్కుల సంఘం నేతలు గడ్డం లక్ష్మణ్, ఎన్‌. నారాయణరావు విమర్శించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్​కౌంటర్లన్నీ చట్టబద్ద ఉల్లంఘన హత్యలుగా ప్రజాస్వామిక వాదులు భావించాలని కోరారు. 2015 నుంచి ములుగులో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్ వరకు నిజనిర్థారణకు బయలు దేరిన మానవహక్కుల వేదిక నాయకులను పోలీసులు నిర్బంధించి వదిలిపెట్టారని తెలిపారు. ఆదిలాబాద్​, వరంగల్​, భద్రాద్రి కొత్తగూడెం అటవీ ప్రాంతాల్లో కొనసాగుతున్న పోలీసు కూంబింగ్​‌ను వెంటనే నిలుపుదల చేయాలన్నారు.

Tags:    

Similar News