గడ్చిరోలిలో మళ్లీకాల్పుల కలకలం

దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లాలో మళ్లీ కాల్పుల శబ్దం కలకలం రేపింది. గురువారం సాయంత్రం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య బీకర కాల్పులు జరిగాయి. ఈ విషయాన్ని శుక్రవారం ఓ సీనియర్ పోలీసుఅధికారి వెల్లడించారు. నిన్న జిల్లాలోని కొర్చి ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపడుతుండగా.. అటుగా వచ్చిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. మావోయిస్టులు కాల్పులు జరుపుతూ దట్టమైన అడవుల్లోకి పారిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి […]

Update: 2020-07-24 11:29 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లాలో మళ్లీ కాల్పుల శబ్దం కలకలం రేపింది. గురువారం సాయంత్రం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య బీకర కాల్పులు జరిగాయి. ఈ విషయాన్ని శుక్రవారం ఓ సీనియర్ పోలీసుఅధికారి వెల్లడించారు. నిన్న జిల్లాలోని కొర్చి ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపడుతుండగా.. అటుగా వచ్చిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. మావోయిస్టులు కాల్పులు జరుపుతూ దట్టమైన అడవుల్లోకి పారిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలవ్వలేదని పోలీసులు తెలిపారు. కాగా, జిల్లాలోని పలు ప్రాంతాల్లో నక్సలైట్ ఉద్యమ నేత చారు మంజుందర్ జ్ఞాపకార్థం ఈ నెల జూలై 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ‘అమరవీరుల వారం’గా పాటించాలంటూ పోస్టర్లు వెలిసినట్లు తెలుస్తోంది. మసేలీ-నవార్గాన్ దారిలో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News