పీఆర్సీ కోసం ఉద్యోగుల పోరుబాట
దిశ, తెలంగాణ బ్యూరో: పీఆర్సీ కోసం ఉద్యోగులు పోరుబాట పట్టారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఈఏ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ల ముందు నిరసనలకు దిగారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆందోళన చేశారు. తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఈఏ అధ్యక్షుడు చిలగాని సంపత్కుమారస్వామి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు కొంతకాలంగా నిరసనలు చేపడుతున్నారన్నారు. ఈనెల 10న […]
దిశ, తెలంగాణ బ్యూరో: పీఆర్సీ కోసం ఉద్యోగులు పోరుబాట పట్టారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఈఏ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ల ముందు నిరసనలకు దిగారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆందోళన చేశారు. తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఈఏ అధ్యక్షుడు చిలగాని సంపత్కుమారస్వామి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు కొంతకాలంగా నిరసనలు చేపడుతున్నారన్నారు. ఈనెల 10న అన్ని జిల్లాలో ప్రభుత్వ ఆఫీసుల వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశామని, కానీ ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదని ఆరోపించారు. పీఆర్సీ కోసం తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగవర్గాలందరినీ కలుపుకుని ఉద్యమం చేస్తామని, దీనిలో భాగంగా సోమవారం శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల దగ్గర నిరసన తెలిపామన్నారు.