చేసిన తప్పు ఒప్పుకొని.. ఉప సర్పంచ్ క్షమాపణ చెప్పాలి
దిశ, శాయంపేట: హన్మకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందాపురం ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఈసీ రజనీకాంత్‌పై రెండ్రోజుల క్రితం ఉపసర్పంచ్ చంద్రయ్య దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిని నిరసిస్తూ సోమవారం ఎన్ఆర్ఈజీఎస్ ఇబ్బంది, పంచాయతీ కార్యదర్శులు నల్ల బ్యాడ్జీలతో ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమానికి గోవిందాపూర్ మాజీ సర్పంచ్ చింతనిప్పుల భద్రయ్య సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా భద్రయ్య మాట్లాడుతూ.. ఎన్ఆర్ఈజీఎస్ ఇంజినీరింగ్ అధికారి రజనీకాంత్‌పై గోవిందాపూర్ ఉప సర్పంచ్ చంద్రయ్య […]
దిశ, శాయంపేట: హన్మకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందాపురం ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఈసీ రజనీకాంత్‌పై రెండ్రోజుల క్రితం ఉపసర్పంచ్ చంద్రయ్య దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిని నిరసిస్తూ సోమవారం ఎన్ఆర్ఈజీఎస్ ఇబ్బంది, పంచాయతీ కార్యదర్శులు నల్ల బ్యాడ్జీలతో ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమానికి గోవిందాపూర్ మాజీ సర్పంచ్ చింతనిప్పుల భద్రయ్య సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా భద్రయ్య మాట్లాడుతూ.. ఎన్ఆర్ఈజీఎస్ ఇంజినీరింగ్ అధికారి రజనీకాంత్‌పై గోవిందాపూర్ ఉప సర్పంచ్ చంద్రయ్య తప్పుడు ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు.
గ్రామ రైతులకు ఈసీ రజినీకాంత్ అనేక సేవలు అందించారని కొనియాడారు. రైతుల వద్ద ఏనాడూ రూపాయి ఆశించకుండా పనిచేశారని అన్నారు. కావాలనే కొంతమంది అధికారులపై భౌతికదాడులకు పాల్పడి, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇది సమంజసం కాదని విమర్శించారు. ఇప్పటికైనా గ్రామ ఉప సర్పంచ్ చంద్రయ్య చేసిన తప్పును ఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సంఘీభావం తెలిపిన వారిలో గోవిందపూర్ వార్డు సభ్యులు మారెళ్ళ సదయ్య, బీజేపీ మండల ఉపాధ్యక్షులు ఆకుతోట ఈశ్వర్, మనోహర్ రావు ఉన్నారు.