వేతనం లేని సెలవుల్లో గో ఎయిర్ ఉద్యోగులు
న్యూఢిల్లీ: తమ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది వేతనం లేని సెలవుల్లో ఉన్నట్లు ప్రైవేట్ ఎయిర్ లైన్స్ సంస్థ గో ఎయిర్ ప్రకటించింది. లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 3 వరకు విమాన సర్వీసులు పూర్తి స్థాయిలో నిలిచిపోవడంతో తమకున్న 5,500 మంది ఉద్యోగుల్లో 90 శాతం మందికి వేతనం లేని సెలవులను మంజూరు చేసినట్టు వెల్లడించింది. అయితే, అత్యవసర కార్యకలాపాల్లో భాగంగా ప్రస్తుతం 10 శాతం మంది ఉద్యోగులు […]
న్యూఢిల్లీ: తమ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది వేతనం లేని సెలవుల్లో ఉన్నట్లు ప్రైవేట్ ఎయిర్ లైన్స్ సంస్థ గో ఎయిర్ ప్రకటించింది. లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 3 వరకు విమాన సర్వీసులు పూర్తి స్థాయిలో నిలిచిపోవడంతో తమకున్న 5,500 మంది ఉద్యోగుల్లో 90 శాతం మందికి వేతనం లేని సెలవులను మంజూరు చేసినట్టు వెల్లడించింది. అయితే, అత్యవసర కార్యకలాపాల్లో భాగంగా ప్రస్తుతం 10 శాతం మంది ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారనీ, వీరికి సగం వేతనం చెల్లిస్తామని సంస్థ స్పష్టం చేసింది.
Tags: go air, employees, leave with out pay, lock down