రిటైర్మెంట్ ఏజ్ పై ఉద్యోగుల అసంతృప్తి… వైరల్ అవుతున్న ఉపాధ్యాయుడి పోస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 యేళ్ల నుంచి 61 సంవత్సరాలకు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా అనే ప్రశ్న ప్రస్తుతం అందరిలో మెదులుతోంది. ఉద్యోగాలివ్వమని అడుగుతున్నా.. నోటిఫికేషన్‌లు ఇవ్వని ప్రభుత్వం, అడగకుండానే వయోపరిమితిని పెంచడంపై నిరుద్యోగులు గతంలోనే విమర్శించారు. అయితే తాజాగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అశోక్ కుమార్ రిటైర్మెంట్ ఏజ్ ని పెంచడంపై తన అభిప్రాయాన్ని సోషల్ […]
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 యేళ్ల నుంచి 61 సంవత్సరాలకు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా అనే ప్రశ్న ప్రస్తుతం అందరిలో మెదులుతోంది. ఉద్యోగాలివ్వమని అడుగుతున్నా.. నోటిఫికేషన్‌లు ఇవ్వని ప్రభుత్వం, అడగకుండానే వయోపరిమితిని పెంచడంపై నిరుద్యోగులు గతంలోనే విమర్శించారు. అయితే తాజాగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అశోక్ కుమార్ రిటైర్మెంట్ ఏజ్ ని పెంచడంపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఆ పోస్ట్ ప్రకారం “నిన్నటితో నాకు 58 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. వాస్తవానికి ఉపాధ్యాయ సేవలకు చివరి రోజు కావాల్సింది. ప్రభుత్వ అనుచిత నిర్ణయంతో 3 సంవత్సరాలు పెంచింది. నాకు ఆర్థిక తోడ్పాటు కూడా పెరిగింది. కానీ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి బదులుగా వారికి ప్రభుత్వం చేసిన ద్రోహం బాధను కలిగిస్తూనే ఉన్నది. నన్ను కలచి వేస్తూనే ఉన్నది.” తన వృత్తిలో ఎంతోమంది విద్యార్థులకు చదువు నేర్పి ప్రయోజకులుగా చేయాలని అనుకున్నా… ఇలా వయోపరిమితి పెంచడంతో ప్రభుత్వ ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతుండటాన్ని తెలిపేలా పోస్ట్ ఉంది. దీనిపై స్పందించిన నెటిజన్లు ఉపాధ్యాయుడికి సపోర్ట్ చేస్తున్నారు.
సిగ్గులేని ప్రభుత్వం….
1200 మంది అమరుల త్యాగాలకు విలువ ఇవ్వని ఈ సిగ్గులేని ప్రభుత్వం ఉన్న ఒకటే లేకున్నా ఒకటే .
జై బానిసల తెలంగాణ..@krishanKTRS @Arvindharmapuri @RaghunandanraoM @YSSR2023 @RaoKavitha @Eatala_Rajender @TelanganaCMO @RSPraveenSwaero @seethakkaMLA @TUYOfficialPage pic.twitter.com/iXxTFy6vzX— Chandra Shekar Reddy Hindu (@Chandu19219437) September 10, 2021
ఉపాధ్యాయుడి పోస్ట్ కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి
https://m.facebook.com/story.php?story_fbid=3927265794046671&id=100002898684251