ఐపీఎల్ స్టేడియాల్లో 50శాతం మంది ప్రేక్షకులకు అనుమతి: ఈసీబీ
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ జరిగే సమయంలో స్టేడియాలలోకి 30 నుంచి 50శాతం ప్రేక్షకులను అయినా అనుమతించాలని భావిస్తున్నట్లు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) కార్యదర్శి ముబాషీర్ ఉస్మానీ తెలిపారు. ఈ మేరకు యూఏఈ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. శుక్రవారం పీటీఐతో మాట్లాడుతూ.. ‘బీసీసీఐ నుంచి పూర్తి అనుమతులు రాగానే మేం మా ప్రభుత్వ అనుమతుల కోసం ప్రయత్నిస్తాం. అదే సమయంలో స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్‌ను కూడా ప్రభుత్వానికి సమర్పిస్తాం’ అని తెలిపారు. తమ దేశంలోని […]
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ జరిగే సమయంలో స్టేడియాలలోకి 30 నుంచి 50శాతం ప్రేక్షకులను అయినా అనుమతించాలని భావిస్తున్నట్లు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) కార్యదర్శి ముబాషీర్ ఉస్మానీ తెలిపారు. ఈ మేరకు యూఏఈ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. శుక్రవారం పీటీఐతో మాట్లాడుతూ.. ‘బీసీసీఐ నుంచి పూర్తి అనుమతులు రాగానే మేం మా ప్రభుత్వ అనుమతుల కోసం ప్రయత్నిస్తాం. అదే సమయంలో స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్‌ను కూడా ప్రభుత్వానికి సమర్పిస్తాం’ అని తెలిపారు. తమ దేశంలోని ప్రజలు ఐపీఎల్‌ను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించాలని చాలా ఆసక్తిగా ఉన్నామన్నారు. ఎప్పుడో ఒకసారి వచ్చే ఇలాంటి ఈవెంట్లను తమ ప్రేక్షకులు టీవీల్లో కాక ప్రత్యక్షంగా చూస్తేనే బాగుంటుందని భావిస్తున్నామని చెప్పారు. కాకపోతే ఇదంతా ప్రభుత్వం చేతిలోనే ఉందని, ఇప్పటికే చాలా ఈవెంట్లకు ప్రభుత్వం 30 నుంచి 50శాతం ప్రజలను అనుమతిస్తోందని తెలిపారు. కాగా, ఐపీఎల్ జీసీ సమావేశం అనంతరం భారత ప్రభుత్వ అనుమతికి బీసీసీఐ ప్రతిపాదనలు పంపనున్నట్లు సమాచారం.