30 మంది అభ్యర్థుల ఎలిమినేషన్..
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : హైదరాబాద్ , రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకుండా పోయిన నేపథ్యంలో రెండవ ప్రాధాన్యతా ఓట్లపై అంతటా ఆసక్తి మొదలైంది. ప్రస్తుతం నియోజకవర్గంలో సెకండ్ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోండగా అభ్యర్థుల ఎలిమినేషన్‌తో పాటు వారికి వచ్చిన సెకండ్ ప్రాధాన్యత ఓట్లను మిగిలిన అభ్యర్థులకు కేటాయిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 93 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా […]
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : హైదరాబాద్ , రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకుండా పోయిన నేపథ్యంలో రెండవ ప్రాధాన్యతా ఓట్లపై అంతటా ఆసక్తి మొదలైంది. ప్రస్తుతం నియోజకవర్గంలో సెకండ్ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోండగా అభ్యర్థుల ఎలిమినేషన్‌తో పాటు వారికి వచ్చిన సెకండ్ ప్రాధాన్యత ఓట్లను మిగిలిన అభ్యర్థులకు కేటాయిస్తున్నారు.
ఈ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 93 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఇప్పటి వరకూ 30 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ పూర్తయింది. ఎలిమినేషన్ అయిన అభ్యర్థుల ఓట్లలో సెకండ్ ప్రాధాన్యత ఓట్ల కేటాయింపులోనూ టీఆర్ఎస్కే మొగ్గు కనబడుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్కు 113, బీజేపీకి 97, కాంగ్రెస్‌కు 48, ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 67 ఓట్లు వచ్చాయి. అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు (రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి) ఇలా ఉన్నాయి. బీజేపీ–1,04,765 , టీఆర్ఎస్–1,12,802, నాగేశ్వర్ –53,677, కాంగ్రెస్– 31,602 లభించాయి.