విద్యుత్ VS రవాణా శాఖ.. నువ్వెంత అంటే నువ్వెంత..?

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో వివాదం తెరమీదకు వచ్చింది. రెండు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా ఒకరిమీద మరొకరు ప్రతీకార చర్యలకు పూనుకున్నారు. ఈ ఘటన జిల్లాలోని మిర్యాడగూడలో స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకివెళితే.. గతంలో ఉన్న పెండింగ్ బకాయిలు చెల్లించలేదనే కారణంతో ఆర్టీవో కార్యాలయానికి విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ నిలిపివేశారు. దీంతో రవాణా శాఖ అందుకు ప్రతీకారంగా విద్యుత్ అధికారులు, సిబ్బంది వినియోగించే వాహనాలను సీజ్ చేసింది. […]

Update: 2021-08-05 10:49 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో వివాదం తెరమీదకు వచ్చింది. రెండు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా ఒకరిమీద మరొకరు ప్రతీకార చర్యలకు పూనుకున్నారు. ఈ ఘటన జిల్లాలోని మిర్యాడగూడలో స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకివెళితే.. గతంలో ఉన్న పెండింగ్ బకాయిలు చెల్లించలేదనే కారణంతో ఆర్టీవో కార్యాలయానికి విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ నిలిపివేశారు. దీంతో రవాణా శాఖ అందుకు ప్రతీకారంగా విద్యుత్ అధికారులు, సిబ్బంది వినియోగించే వాహనాలను సీజ్ చేసింది.

అయితే, రీచార్జ్ మీటర్లకు విద్యుత్ పునరుద్ధరణ తమ చేతిలో లేదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. తమ డ్యూటీ తాము నిర్వర్తిస్తే అందుకు బదులుగా రవాణాశాఖ అధికారులు తమ వాహనాలను సీజ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. రవాణా శాఖ అధికారులు ప్రవర్తించిన తీరును నిరసిస్తూ విద్యుత్ అధికారులు 2 గంటల పాటు ఆ శాఖ కార్యాలయంలో కరెంట్ సరఫరాను నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే రెండు ప్రభుత్వ శాఖలు ఒకదానిమీద మరొకటి రీవెంజ్ తీసుకోవడం ప్రస్తుతం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News