ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ

ఏపీలో నలుగురు రాజ్యసభ సభ్యుల ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యుల నామినేషన్ పత్రాలు రేపటి నుంచి అమరావతిలోని అసెంబ్లీ కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉండనున్నాయని వెల్లడించారు. నామినేషన్ ప్రక్రియ రేపటి నుంచి మార్చి 13వ తేదీ మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. స్వీకరించిన నామినేషన్లను మార్చి 16న పరిశీలించనున్నారు. దాఖలు చేసిన నామినేషన్లను […]

Update: 2020-03-06 06:11 GMT

ఏపీలో నలుగురు రాజ్యసభ సభ్యుల ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యుల నామినేషన్ పత్రాలు రేపటి నుంచి అమరావతిలోని అసెంబ్లీ కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉండనున్నాయని వెల్లడించారు.

నామినేషన్ ప్రక్రియ రేపటి నుంచి మార్చి 13వ తేదీ మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. స్వీకరించిన నామినేషన్లను మార్చి 16న పరిశీలించనున్నారు. దాఖలు చేసిన నామినేషన్లను మార్చి 18 మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించారు. రాజ్యసభ సభ్యుల ఎన్నికలు ఏపీ అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో మార్చి 26 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు.

ఏపీలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న కె.కేశవరావు (కేకే), మహ్మద్ అలీఖాన్, టి.సుబ్బరామిరెడ్డి, తోట సీతారామలక్ష్మిల పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో వీరి స్థానంలో మరో నలుగురు రాజ్యసభ సభ్యులు ఎన్నిక కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు రాజ్యసభ స్థానాలతో పాటు తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో 55 మంది రాజ్యసభ సభ్యులు ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందనున్నారు. వీరి స్థానాల్లో కొత్త సభ్యులు ఎన్నిక కానున్నారు.

tags : ap, politics, rajyasabha elections, elections for four members, kk, tsr, mahommed alikhan, seetharamalaxmi

Tags:    

Similar News