మౌలాలిలో కౌంటింగ్‌ నిలిపివేత..

దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గ్రేటర్ ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ మెజార్టీ డివిజనల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మౌలాలి డివిజన్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఎన్నికల రోజు మొత్తం 361 ఓట్లు నమోదు కాగా, ఇవాళ బాక్సులో 394 ఓట్లు ఉన్నాయి. అంటే అధికంగా […]

Update: 2020-12-04 01:41 GMT

దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గ్రేటర్ ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ మెజార్టీ డివిజనల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఫలితాలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే మౌలాలి డివిజన్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఎన్నికల రోజు మొత్తం 361 ఓట్లు నమోదు కాగా, ఇవాళ బాక్సులో 394 ఓట్లు ఉన్నాయి. అంటే అధికంగా 33 ఓట్లు తేలాయి. దీంతో అధికారులు కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేసి, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

Tags:    

Similar News