నేడే ఓట్ల లెక్కింపు…
దిశ సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి జిల్లా కేంద్రంలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరగనున్న లెక్కింపు ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గత నెల ఏప్రిల్ 30వ తేదీన 43 వార్డులకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఇచ్చిన నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించనున్నారు. 236 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఎలాంటి అవాంఛనీయ […]
దిశ సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి జిల్లా కేంద్రంలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరగనున్న లెక్కింపు ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గత నెల ఏప్రిల్ 30వ తేదీన 43 వార్డులకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఇచ్చిన నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించనున్నారు. 236 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమీషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. సిద్దిపేట మున్సిపాలిటీలోని 43 వార్డులకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 1,00,678 ఓట్లకు గానూ, 67,539 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 34,455 పురుషులు, 38,077 మంది మహిళలు, ఇతరులు 07 గురు తమ ఓటు హక్కు వినియోగించుకోగా 67,08
పోలింగ్ శాతం నమోదైంది. ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో కౌంటింగ్ కోసం రెండు హాలో మొత్తం 22 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొదటి రౌండ్‌లో హాల్ నెంబర్ -1లో 1 వ వార్డు నుంచి 12 వ వార్డుల వరకు, హాల్ నెంబర్ -2లో 13 నుంచి 21 వ వార్డుల వరకు లెక్కింపు జరగనుండగా, రెండవ రౌండ్లో హాల్ నెంబర్ -1 లో 22 నుంచి 33 వార్డులకు , హాల్ నెంబర్ -2 లో 34 నుంచి 43 వార్డుల వరకు లెక్కింపు జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశామని, రెండు రౌండ్లలో మూడు నుంచి నాలుగు గంటల్లో ఫలితాలు తేలనున్నాయని అధికారులు తెలిపారు. కరుణ విజృంభిస్తున్న నేపథ్యంలో నెగెటివ్ రిపోర్ట్ ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్ హాల్లోకి అనుమతి ఉంటుందని అదనపు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. కౌంటింగ్ హాల్లోకి వచ్చే ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు, పాత్రికేయులు తప్పకుండా కరోనా నెగెటివ్ రిపోర్టు తమ వెంట తీసుకురావాలని ఆయన అన్నారు.