నిబంధనల ప్రకారమే వాయిదా
ఏపీలో ఎన్నికల వాయిదాపై దుమారం చెలరేగడంతో ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ మీడియాకు ఓ నోట్ విడుదల చేశారు. నింబధనలు అనుసరించే ఎన్నికలను వాయిదా వేశామన్నారు. ‘కరోనాను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించింది. అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. జాతీయ స్థాయి సంస్థలను సంప్రదించాకే ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నాం. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలు పెడతాం. ఎన్నికల కోడ్ మేరకే ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకున్నాం. ఆరు వారాల్లోపే తిరిగి ఎన్నికలు […]
ఏపీలో ఎన్నికల వాయిదాపై దుమారం చెలరేగడంతో ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ మీడియాకు ఓ నోట్ విడుదల చేశారు. నింబధనలు అనుసరించే ఎన్నికలను వాయిదా వేశామన్నారు. ‘కరోనాను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించింది. అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. జాతీయ స్థాయి సంస్థలను సంప్రదించాకే ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నాం. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలు పెడతాం. ఎన్నికల కోడ్ మేరకే ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకున్నాం. ఆరు వారాల్లోపే తిరిగి ఎన్నికలు నిర్వహిస్తాం. ఎన్నికల ప్రక్రియలో హింసపై పలు పార్టీలు ఇప్పటికే ఫిర్యాదులు చేశాయి. హైకోర్టుతో సమానంగా ఎస్ఈసీని చూడాలి. ఇలాంటి చర్యలు వ్యవస్థలను బలహీనపరుస్తాయి. ఎన్నికల వ్యవస్థ రాజ్యంగబద్దమైన స్వతంత్ర వ్యవస్థ. ప్రస్తుతం ఎన్నికలను నిలుపుదల మాత్రమే చేశాం, రద్దు చేయలేదన్న విషయం గుర్తించుకోవాలి’ అని ఎన్నికల కమిషనర్ నోట్‌లో పేర్కొన్నారు.
tag; ap election commissioner, ramesh kumar, press note, ap news