ఈసీ, కలెక్టర్ కీలక ప్రకటన.. అక్టోబర్ 30న వేతనంతో కూడిన సెలవు

దిశ, కరీంనగర్ సిటీ : హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ఈ నెల 30వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. అయితే, హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో వేతనంతో కూడిన సెలవును ప్రకటించినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్, హన్మకొండ జిల్లాల పరిధిలో గల హుజురాబాద్ నియోజకవర్గంలోని ఫ్యాక్టరీలు, దుకాణాలు, సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు.. షాప్స్ అండ్ ఎస్టాబ్ల్సిష్ మెంట్ యాక్ట్ 1988, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం వేతనంతో కూడిన […]

Update: 2021-10-24 04:43 GMT

దిశ, కరీంనగర్ సిటీ : హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ఈ నెల 30వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. అయితే, హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో వేతనంతో కూడిన సెలవును ప్రకటించినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

కరీంనగర్, హన్మకొండ జిల్లాల పరిధిలో గల హుజురాబాద్ నియోజకవర్గంలోని ఫ్యాక్టరీలు, దుకాణాలు, సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు.. షాప్స్ అండ్ ఎస్టాబ్ల్సిష్ మెంట్ యాక్ట్ 1988, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ సందర్భంగా ఫ్యాక్టరీలు, దుకాణాలు, షాపులు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులంతా విధిగా పోలింగ్ కేంద్రానికి విచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించుకొవాలని కలెక్టర్ కోరారు.

Tags:    

Similar News