ఉగాది రోజు ఇళ్ల పట్టాల పంపిణీ లేదు
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్సీపీకి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి ఇళ్ల పట్టాలు పంపణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూములు సేకరించి పంపిణీకి చర్యలు కూడా చేపట్టింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు చేపట్టకూడదని ఎలక్షన్ కమిషన్ సూచించింది. ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 25న నిర్వహించ తలపెట్టిన ఇళ్ల పట్టాల […]
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్సీపీకి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి ఇళ్ల పట్టాలు పంపణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూములు సేకరించి పంపిణీకి చర్యలు కూడా చేపట్టింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు చేపట్టకూడదని ఎలక్షన్ కమిషన్ సూచించింది. ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 25న నిర్వహించ తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. ఈసీ ఆదేశాలతో ఆ కార్యక్రమానికి బ్రేక్ పడింది.
Tags: ec, election commission, ysrcp, ap