స్థానిక ఎన్నికలకు రెడీ: ఎలక్షన్ కమిషన్
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని బందరు రోడ్డులోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 13 జిల్లాల్లో సజావుగా ఎన్నికల నిర్వహణకు పూర్తి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే పోలీసు శాఖతో దీనిపై చర్చించామని తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని ఆయన వెల్లడించారు. […]
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని బందరు రోడ్డులోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 13 జిల్లాల్లో సజావుగా ఎన్నికల నిర్వహణకు పూర్తి చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఇప్పటికే పోలీసు శాఖతో దీనిపై చర్చించామని తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని ఆయన వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. దశల వారీగా సిబ్బంది నియామకం పూర్తి చేస్తామని చెప్పారు. స్థానిక ఎన్నికలకు సరిపడా సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టుల ఏర్పాటు చేశామని అన్నారు.
ఎన్నికలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు జిల్లాల యంత్రాంగాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికి లక్షా 20 వేల బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మరో 40 వేల బ్యాలెట్ బాక్సులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని, ఒడిశా నుంచి 5 వేల బ్యాలెట్ బాక్సులు తెప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.
బ్యాలెట్ పేపర్లు, ఇతర మౌళిక సదుపాయాలపై కలెక్టర్లకు సూచనలు చేశామని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పంచాయతీ, మున్సిపల్ సిబ్బందితో చర్చించాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ఉన్నతమైన, నాణ్యమైన ప్రమాణాలతో స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
Tags: ap, election commission, local elections, rama sundar reddy, i&pr