ఈసీకి ఆగ్రహం తెప్పిస్తే ఇలాగే ఉంటుంది.. జమ్మికుంట SHO ఔట్

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈసీ మార్క్ బదిలీలు మొదలయ్యాయి. మొట్టమొదటి బదిలీ వేటు జమ్మికుంట ఎస్‌హెచ్‌ఓ రాంచందర్ రావుపై పడింది. ఆయన్ను వరంగల్ డీఐజీకి అటాచ్డ్ చేసి, జమ్మికుంట సీఐగా కరీంనగర్ ట్రాఫిక్ 1 సీఐ గుర్రం తిరుమల్‌ను నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతటితోనే ఆగేనా..? ఉపఎన్నికల్లో ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఎవరిపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళన నెలకొంది. తాజాగా జమ్మికుంట టౌన్ ఎస్‌హెచ్‌ఓ […]

Update: 2021-10-25 06:02 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈసీ మార్క్ బదిలీలు మొదలయ్యాయి. మొట్టమొదటి బదిలీ వేటు జమ్మికుంట ఎస్‌హెచ్‌ఓ రాంచందర్ రావుపై పడింది. ఆయన్ను వరంగల్ డీఐజీకి అటాచ్డ్ చేసి, జమ్మికుంట సీఐగా కరీంనగర్ ట్రాఫిక్ 1 సీఐ గుర్రం తిరుమల్‌ను నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంతటితోనే ఆగేనా..?

ఉపఎన్నికల్లో ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఎవరిపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళన నెలకొంది. తాజాగా జమ్మికుంట టౌన్ ఎస్‌హెచ్‌ఓ రాంచందర్ రావును బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడటంతో హుజురాబాద్‌లో ఇంకా ఎంతమంది అధికారులపై వేటు పడుతుందోనన్న చర్చ మొదలైంది. ఇప్పటికే ఇక్కడ పనిచేస్తున్న పలువురు పోలీసు అధికారులతో పాటు పలు శాఖలకు చెందినవారిపై ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేఫథ్యంలో ఈసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. జాబితాలో ఏఏ అధికారుల పేర్లు ఉన్నాయో అన్న విషయంపై అధికార వర్గాల్లో అంతర్గతంగా చర్చ సాగింది. జమ్మికుంట సీఐపై బదిలీ వేటు వేయగానే ఇంతటితోనే ఈసీ సరిపెడుతుందా లేక, మరికొంతమంది అధికారులపై వేటు వేస్తుందా అన్న విషయంపై తర్జనభర్జన సాగుతోంది. నియోజకవర్గంలోని ఓ అధికారిపై గతంలో ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించలేదని ఆయన్ను ఎలక్షన్ విధులకు దూరంగా ఉంచాలని అధికారులు ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సదరు పోలీసు అధికారి పూర్తి వివరాలు తెలుసుకుని ఈసీఐకి ఫిర్యాదు చేయాలని రాజకీయ పార్టీలు యోచిస్తున్నట్టుగా సమాచారం.

అప్పుడలా… ఇప్పుడలా…

ఈటల ఎపిసోడ్ వ్యవహారంతో మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ ప్రక్రియను ప్రారంభించింది. ఆ తరువాత పోలీసు, రెవెన్యూ, మునిసిపల్‌తో పాటు దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా ఎన్నికల కమిషన్ పోలింగ్ హుజురాబాద్ నియోజకవర్గంలో పోస్టింగ్ అయిన అధికారులపై బదిలీ వేటు వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. జమ్మికుంట సీఐ రాంచందర్ రావును వరంగల్ డీఐజీకి అటాచ్డ్ చేస్తూ, ఆయన స్థానంలో కరీంనగర్ ట్రాఫిక్ 1 సీఐ తిరుమల్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈటల రాజేందర్ రాజీనామా తరువాత బదిలీల ప్రక్రియ ఎలా సాగిందో ఇప్పుడు ఈసీఐ కూడా బదిలీల తంతును మొదలు పెట్టినట్టుగా ఉంది.

Tags:    

Similar News